పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన లావణ్య త్రిపాఠి.. యువకుడిపై కేసు నమోదు
అందాల తార లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. కొద్దికాలంగా వేధిస్తున్న ఓ యువకుడిపై ఫిర్యాదు చేస్తూ పోలీసు స్టేషన్లు మెట్లు ఎక్కింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించింది. అందం, అభినయంతో మెప్పిస్తున్న లావణ్య త్రిపాఠి పోలీసు స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..

యువకుడి వేధింపులతో
హీరోయిన్ అంటే యువకుడు మోజు పడే సంఘటనలు ఎక్కువగానే కనిపిస్తాయి. అదే లావణ్య విషయంలోను జరిగింది. సునిశిత్ అనే యువకుడు కొద్దికాలంగా లావణ్య వెంటపడుతూ ఫోన్‌లో, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలిసింది. యువకుడి వేధింపులు శృతి మించడంతో పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తప్పలేదు అని సన్నిహితులు వెల్లడించారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో
కొద్ది రోజులు తనను పెళ్లి చేసుకొన్నట్టు సునిశిత్ అనే యువకుడు ప్రచారం చేస్తున్నాడు. దాంతో నా పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతున్నది. నా తల్లిదండ్రుల గౌరవానికి భంగం వాటిల్లుతున్నది. కాబట్టి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై సానుకూల స్పందన
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆ విన్నపానికి సానుకూలంగా స్పందించారు. ఫిర్యాదు చేసిన యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసి తగిన న్యాయం చేస్తామని లావణ్య త్రిపాఠికి పోలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం.
Recommended Video

వకీల్ సాబ్‌లో లావణ్య త్రిపాఠి
ఇదిలా ఉండగా, పింక్ రీమేక్‌గా పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న వకీల్ సాబ్ చిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ ఇటీవల జరిపిన సంప్రదింపుల్లో ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిని చూపినట్టు సమాచారం. త్వరలోనే లావణ్య త్రిపాఠి చేరికపై అధికారికంగా నిర్మాత దిల్ రాజు ప్రకటన చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











