హీరోయిన్‌పై కేసులే కేసులు, జైలు జీవితమే!
చెన్నై : 'మద్రాసు కేఫ్' సినిమాలో నటించిన మలయాళ హీరోయిన్ లీనా మరియాపాల్(25), ఆమె స్నేహితుడు బాలాజీ అలియాస్ చంద్రశేఖర్‌ను దక్షిణ ఢిల్లీలోని ఓ వ్యవసాయ క్షేత్రం(ఫామ్ హౌస్) లో మంగళవారం పోలీసులు ఆరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
చెన్నైలోని కెనరా బ్యాంకుకు తప్పుడు పత్రాలు సమర్పించి మోస పూరితంగా రూ.19 కోట్లు భారీ రుణం తీసుకోవడమే ఇందుకుకారణం. ఈ రుణం తిరిగి చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన వీరు ఢిల్లీలోని ఫతేపుర్‌బేరీలో దొరికిపోయారు. కాగా...లీనా మరియా పాల్ ఈ ఒక్క కెనరా బ్యాంకులోనే కాదు... తమిళనాడు, కేరళలోని అనేక బ్యాంకుల్లో అమ్ముడు ఇలాంటి మోసాలకే పాల్పడిందట.

ఆమె చేసిన నేరాలపై సీబీఐ దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. ఆమెపై మరిన్ని కేసులో నమోదు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆమెపై 420, 120 బి, 406 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. కోర్టులో నేరం రెజువైన తర్వాత ఆమెకు జైలు శిక్ష పడనుంది.
ఆమెపై ఉన్న వివిధ కేసుల నేపథ్యంలో....ఆమెకు జైలు జీవితం తప్పే అవకాశాలు న్యాయ నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లు తన అందచందాలతో ప్రేక్షకులను అలరించిన లీనా మరియా పాల్...ఇప్పుడు కటకటాల వెనక్కి వెలుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











