For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకుడికి విడాకులు.. మరో అవకాశం లేకపోయింది.. వారి కారణంగానే.. పవన్ చిత్రంలో నటి

  By Rajababu
  |

  రెండు దశాబ్దాల తర్వాత సీనియర్ నటి లిసీ లక్ష్మీ చిత్ర పరిశ్రమలో మళ్లీ రెండో ఇన్సింగ్స్ ప్రారంభించింది. అత్తారింటికి దారేది చిత్రంలో నదియాను తెరపైకి తెచ్చి ఆకట్టుకొన్న పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ద్వయం లిసీ లక్ష్మీని మరోసారి టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు. గతంలో సాక్షి, మగాడు, దోషి నిర్ధోషి, 20వ శతాబ్దం, మామాశ్రీ, ఆత్మబంధం, శివశక్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. చివరిసారిగా 1991లో శివశక్తి చిత్రంలో లీసి కనిపించింది. పెళ్లి తర్వాత నటనకు దూరం కావాల్సి వచ్చింది.. అప్పట్లో మరో ఆప్షన్ లేకపోయిందనే ఆవేదన వ్యక్తం చేసింది.

  దర్శకుడు ప్రియదర్శన్‌తో

  దర్శకుడు ప్రియదర్శన్‌తో

  కెరీర్ మంచి జోరులో ఉండగానే లిసీ లక్ష్మీ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ను 1990లో వివాహం చేసుకొన్నది. దాంపత్య జీవితంలో విభేదాలు చోటు చేసుకోవడంతో 2014లో ప్రియదర్శన్ నుంచి విడాకులు తీసుకొన్నది. వీరికి ఓ కుమార్తె కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్ ఉన్నారు. ప్రస్తుతం హలో చిత్రంలో అక్కినేని అఖిల్ చిత్రంలో కల్యాణి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నది. వివాహం తర్వాత లిసీ లక్ష్మీ నటనకు దూరమైంది.

  పవన్, త్రివిక్రమ్ సినిమాలో

  పవన్, త్రివిక్రమ్ సినిమాలో

  ప్రస్తుతం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో నితిన్ హీరోగా రూపుదిద్దుకొంటున్న చిత్రంలో లిసీ లక్ష్మీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ హీరోయిన్. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమై షూటింగ్ జరుపుకొంటున్నది.

  25 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు

  25 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు

  నితిన్ చిత్రంలో నటిస్తున్నట్టు లిసీ లక్ష్మీ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. చాలా రోజుల నుంచి నా స్నేహితులు, సన్నిహితుల కోరిక మేరకు నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తున్నాను. నేను నటిస్తున్న చిత్రానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి నిర్మాతులు. ఈ చిత్రంలో నేను చాలా కీలక పాత్రను పోషిస్తున్నాను అని లిసీ తెలిపింది.

  చాలా కోల్పోయాను..

  చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందు నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మళ్లీ న్యూయార్క్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాను. 25 ఏళ్లలో చాలా కోల్పోయాను అనే ఫీలింగ్ కలుగుతున్నది అని లిసీ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది.

  టాలీవుడ్‌కు దూరం కావడం

  టాలీవుడ్‌కు దూరం కావడం

  మగాడు, 20వ శతాబ్దంలో నటించిన తర్వాత టాలీవుడ్‌కు దూరం కావడం చాలా బాధగా ఉంది. అప్పట్లో నటనకు స్వస్తి చెప్పడం మినహా వేరే ఆప్షన్ నా వద్ద లేకపోయింది. నన్ను ఎంతో ఆదరించిన తెలుగు, మలయాళ సినిమాకు దూరం కావడం వల్ల చాలా బాధగా ఉండేది. మలయాళంలో కూడా చాలా కథలు వింటున్నాను. త్వరలోనే మలయాళ చిత్రంలో కూడా నటిస్తాను అని లిసీ లక్ష్మీ వెల్లడించింది.

  గౌతమ్ మీనన్ చిత్రంలో

  గౌతమ్ మీనన్ చిత్రంలో

  తమిళంలో గౌతమ్ మీనన్ చెప్పిన కథ నచ్చింది. నేను స్థాపించిన స్టూడియో వ్యవహారాలు చూసుకోవడం, థియేటర్లను మేనేజ్ చేసుకోవడం నా ముందు ఉన్న మొదటి ప్రయారిటీ. నా రెండో ఇన్సింగ్స్‌ గొప్పగా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాను అని లక్ష్మీ పేర్కొన్నది.

  అగ్రతారల సమ్మేళనం

  అగ్రతారల సమ్మేళనం

  సినిమాలకు దూరమైనప్పటికీ.. చిత్ర పరిశ్రమలోను తన ఆత్మీయులకు, సన్నిహితులకు దగ్గరగానే ఉన్నారు. 80వ దశకంలో సూపర్‌స్టార్లుగా వెలుగొందిన దక్షిణాది నటులు అందరు కలుసుకొనే విధంగా ప్రతి ఏటా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు లిసీ లక్ష్మీ. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనకు రూపం కల్పించింది లిసీ, సుహాసిని కావడం గమనార్హం.

  వచ్చే ఏడాది కలుద్దాం

  ప్రస్తుత ఏడాది నవంబర్ మూడోవారంలో దక్షిణాదికి చెందిన అగ్రనటులు తమిళనాడులోని ఓ నగరంలో సమావేశమయ్యారు. ఆ సందర్బంగా చెన్నైలో మా గ్యాంగ్ కలిసింది. నవంబర్ 17న 8వ సారి మేమంత కలుసుకొన్నాం. ఆనాటి గుర్తులు, మమల్ని ఆనందంలో ముంచెత్తాయి. ఈసారి రాలేకపోయిన వారు.. వచ్చే ఏడాది కలుసుకొనే విధంగా ప్లాన్ చేసుకొండి అని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది.

  హల్లో అంటున్న లిసీ కూతురు

  హల్లో అంటున్న లిసీ కూతురు

  ఇక లిసీ లక్ష్మీ కూతురు కళ్యాణి నటించిన హల్లో చిత్రం డిసెంబర్ మూడోవారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకొన్నది. లవ్ అండ్ రొమాంటిక్, యాక్షన్ చిత్రంగా రూపొందిన హల్లోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  English summary
  Veteran actress Lissy Lakshmi, who recently got divorced from filmmaker Priyadarshan. She is all set to make a comeback to the silver screen after more than two decades. Lissy has been signed to play an essential role in the upcoming project untitled production of Pawan Kalyan – Trivikram Srinivas. the movie starring Nithin and Megha Akash in the lead roles. Krishna Chaitanya is directing the film, whose first and second schedules have been already completed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X