Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి సినిమాలో సప్తగిరికి అత్త పాత్రలో ఆ నటి ఖరారు!
టాలీవుడ్ నటుడు సప్తగిరి కామెడీ పాత్రల్లో నటిస్తూనే హీరోగా కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. తాజాగా సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత సప్తగిరి తాజాగా మరోసారి హీరోగా నటించడానికి అంగీకరించాడు.
దర్శకుడు ఈశ్వర్ రెడ్డి తో సప్తగిరిసినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈశ్వర్ రెడ్డి గతంలో అల్లరి నరేష్ హీరోగా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈసారి సప్తగిరితో మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈశ్వర్ రెడ్డి. ఈ నెలలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రచయిత విక్రమ్ రాజ్ ఈ చిత్రానికి కథ అందించగా ప్రముఖ రైటర్ డైమోండ్ రత్నబాబు మాటలు రాస్తున్నారు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో సప్తగిరికి అత్త పాత్రలో నటి కస్తూరి నటిస్తోందని సమాచారం. కస్తూరి గతంలో నాగార్జున అన్నమయ్య సినిమాలో నటించింది, తాజాగా శమంతకమణి సినిమాలో నటించడం జరిగింది. సప్తగిరి, కస్తూరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయని సమాచారం.