twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మందు, విందు, పొందుతో సల్లారబెడుతున్నారు.. సినీ మంత్రి మాటేమిటి?.. మాధవీలత ఫైర్

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో జరుగుతున్న అన్యాయాలపై హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల సాధినేని యామిని వ్యవహారంపై నిప్పులు చెరిగిన ఆమె తాజాగా చిత్రపురి కాలనీలో జరిగిన అన్యాయాలపై గరం అయ్యారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో సినీ కార్మికులకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై ఘాటుగా స్పందించారు. తన ఫేస్‌బుక్ పోస్టుల చిత్రపురి కాలనీలో నాయకులు యవ్వారంపై ఆమె ఏమన్నారంటే..

     గొప్ప ఆలోచనతో చిత్రపురి కాలనీ

    గొప్ప ఆలోచనతో చిత్రపురి కాలనీ

    చిత్రపురి కాలనీ అబ్బా ఎంత బాగుంది పేరు. కేవలం పేద సినిమా కార్మికులు, సినిమా టీవీ సంబంధం ఉన్న కళాకారులకి ఏర్పాటు చేసిన ఒక కాలనీ. తక్కువ ధరలో కొనడానికి అనుకూలమైన గొప్ప ఆలోచన. నాకు బాగా గుర్తు 2009లో ఓ స్నేహితుడు షూటింగ్ సమయంలో నన్ను కూడా అడిగారు సభ్యత్వం ఉంటే ఛాంబర్‌లో 25 లక్షలకే 2 లేదా 3 బెడ్‌రూం ఇళ్లని చెప్పారు అనే విషయాన్ని మాధవీ లత షేర్ చేశారు.

    సినిమా వాళ్లే లేరు...

    సినిమా వాళ్లే లేరు...

    అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒకసారి దయచేసి వెళ్లి చెక్ చేయండి. మా అపార్ట్‌మెంట్ వెనక కాలనీలో చిత్రపురి కాలనీ ఉంటుంది కనుక చెప్తున్నాను. అక్కడ సినిమావాళ్లు చాలా తక్కువ ఉంటారు. అందరు బయటవాళ్లే అలా ఎలా ఉంటున్నారు? సినీ రంగానికి కాకుండా వేరే వాళ్లు తిష్ట వేయడానికి జరిగిన కుట్రలేమిటి?, మోసాలేమిటి?, మరి సినిమా కార్మికులు ఏమయ్యారు? సినిమావాళ్ళకి కాకుండా బయట ఉద్యోగులకి అవకాశం కూడా లేని వారికీ ఎలా అమ్మబడ్డాయి? అని మాధవీలత ప్రశ్నల వర్షం కురిపించారు.

     మోసాలేమిటీ? సినిమా మంత్రిపై సెటైర్లు

    మోసాలేమిటీ? సినిమా మంత్రిపై సెటైర్లు

    సినీ పేద కార్మికుల కోసం అతి తక్కువ ధరకి ప్రభుత్వ సహకారంతో జరిగిన ఇళ్ల విషయంలో ఎక్కువ ధరలో బయటివారు ఎలా కొనుగోలు చేసారు? కమిటి లో ఉన్న వాళ్ళు చేసిన మోసాలేమిటి? వారితో కుమ్మక్కైన సినిమా మంత్రి సంగతేమిటి? ఇలాంటి అన్యాయాలను అడిగేదెవరు? నిలదీసేవారు ఎవరు? కనీసం ఇలాంటి విషయాల్లోనైనా మగ మహారాజుల సామ్రాజ్యంలో హీరోలుగా ఉన్నారు. వారేమి ఏమి, ఎందుకు మాట్లాడరు? అంటూ మాధవీ లత తన ఫేస్‌బుక్ పోస్టులో నిలదీశారు.

    రౌడీయిజం, కుట్రలతో

    రౌడీయిజం, కుట్రలతో

    ఏపీ రాజధాని అమరావతి మీద మాట్లాడమంటే రాజకీయాల పార్టీల విషయమనే భయం. మరి సినిమావాళ్ళకి జరిగే అన్యాయం వెనక? కచ్చితంగా పార్టీలు ఉన్నాయి. రౌడీయిజం, కుట్రలు ఉన్నాయి. ఈ అన్యాయాలపై జర్నలిస్టుల వద్ద సాక్షాలు ఉన్నాయి. కానీ ప్రచురించే దమ్ములేదు ఎవరికీ లేదు. ఎందుకంటే పెద్దలు నడిపే పత్రికలు, పెద్దలు నడిపే టీవీ చానెల్స్‌లో పాపం జర్నలిస్ట్ బతుకెంత? మందు, విందు, పొందుతో సమస్యను సల్లారబెట్టుడు యవ్వారం. ఇది నిజం ఇదే నిజం నమ్మిన నమ్మకపోయినా, రాసుకొండ్ర అబ్బాయిలు ఎవడేమంటే నాకేంటి? నేను రాసింది నిజం అంతే అని మాధవీ లత చెలరేగి పోయారు.

    Recommended Video

    Madhavi Latha's Love Letter To Pawan Kalyan
    మీటూ ఉద్యమంలో

    మీటూ ఉద్యమంలో

    కాగా, మాధవీలత ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం సమయంలో ఘాటుగా స్పందించిన ఆమె కొద్దికాలంగా కామ్‌గా ఉన్నారు. తాజాగా మళ్లీ మాధవీలత సోషల్ మీడియాలో పలు అంశాలపై నిలదీయడం మొదలుపెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా వివాదంగా మారిన చిత్రపురి కాలనీ వ్యవహారంపై మాధవీలత స్పందించడం సంచలనంగా మారింది.

    English summary
    Actress Maadhavi Latha comments on Chitrapuri Colony issue. She questions irregularities which takes place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X