twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే పనిగా చేస్తే సుఖమే గానీ.. లేనిపోని మాయరోగాలు వస్తాయ్.. మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    నచ్చావులే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధవీలత తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి చిత్రమే ఘన విజయం సాధించడంగతో మంచి అకాశాలే వచ్చాయి. ఆపై నాని హీరోగా వచ్చిన స్నేహితుడా సినిమాలో నటించింది. ఆ చిత్రం సరిగా ఆడకపోయేసరికి ఆమె కెరీర్ కాస్త స్లో అయింది. మళ్లీ అంతగా సినిమాల్లో కనిపించలేదు. అయితే ఈమె సినిమాల పరంగా కంటే ఈమె చేసే వ్యాఖ్యలతోనే చాలా ఫేమస్ అయింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    క్యాస్టింగ్ కౌచ్, మీటూ, శ్రీ రెడ్డి వ్యవహారం జోరుగా ఉన్నప్పుడు మాధవీలత చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మాట్లాడటంతో ఆయన ఫ్యాన్స్‌కు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటుంది. అయితే ఏనాడూ హద్దులు దాటి కామెంట్స్ చేయలేదు. ఈ మధ్య వరుసగా పోస్ట్‌లు పెడుతూ హల్చల్ చేస్తోంది.

    సాధినేని, శ్రీరెడ్డిపై సెటెర్స్..


    ఈ మధ్య మాధవీలత చిత్రపురి కాలనీ, సాధినేని యామిని విషయంలో చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయల గురించి ఓ పోస్ట్ చేసింది. సాధినేని యామినిపై ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో శ్రీ రెడ్డి తలదూర్చి యామినేనికి మద్దుతుగా నిలిచింది. ఇక మాధవీలత శ్రీరెడ్డిల మధ్య పరోక్ష మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే.

    అదే పనిగే చేస్తే.. లేనిపోని మాయరోగాలు..

    అదే పనిగే చేస్తే.. లేనిపోని మాయరోగాలు..

    ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుతుండటంపై మాధవీలత స్పందిస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. దాని సారాంశం ఏంటేంటే.. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. వచ్చే సుకమేమో కానీ కళ్లు దొబ్బుతాయి. కనపడక కళ్లజోళ్లు ఎట్టుకోవాలి ,, లేనిపోని మాయరోగాలు వస్తాయి మెదడు దెబ్బతింటుంది

    ఎలా బతికాం.. ఎం సాధించాము..

    ఎలా బతికాం.. ఎం సాధించాము..

    ఇదే మంచి సమయం. నేనేంటి ?.. నేనెవరు ..నా గమ్యం ఏమిటి.. అసలు ఎందుకు మనం బతుకుతున్నాం.. సాధించేవి ఏమిటి.. ఇన్నాళ్లు ఎలా బతికాం.. ఎం సాధించాము.. డబ్బు ఒకటే జీవితమా? ఆద్యాత్మికం.. ఆంతర్యం.. మంచి విషయాల పైన విశ్లేషణ.. ఎంత గొప్పగా ఆలోచిస్తే మన మనసు బాగుంటుంది.. ఎలాంటి ఆలోచన చేస్తే నిర్మలంగా ఉంటుంది.. మాట తీరు ఎలా ఉంటె బాగుంటుంది

    నేనెపుడు రోజుకి 30 నిముషాలు..

    నేనెపుడు రోజుకి 30 నిముషాలు..

    అలాగే నీలో నువ్వు.. నీతో నువ్వు మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది.. ఒంటరిగా మాట్లాడాము.. నీ శరీరానికి ఏమి కావలి ఎం ఇస్తున్నావు.. ఎన్నో చేయొచ్చు.. నా పాటికి నేనెపుడు రోజుకి 30 నిముషాలు ఫేస్బుక్ అంతే.. ఎపుడైనా లైవ్ ఉంటె కాస్త ఎక్కువ సమయం.. నీతో నువ్వు ఒంటరిగా ఎక్కువగా గడపగలిగే.. అద్భుత అవకాశం ఇదే.. మళ్ళీ జీవితం లో రాదేమో

    శరీరం శక్తిని కోల్పోతుంది

    శరీరం శక్తిని కోల్పోతుంది

    మనం చేసిన తప్పులు.. మనం చేసిన ఒప్పులు.. అన్ని సరిచూసుకుని.. తప్పులుంటే ఇంకెప్పుడు వారి గురించి ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఎంత ఎక్కువగా తప్పుల గురించి ఆలోచిస్తే మెదడు శరీరం శక్తిని కోల్పోతుంది ,,, పవర్ అఫ్ స్పోకెన్

    పంచభూతాలు సహకరిస్తాయి..

    పంచభూతాలు సహకరిస్తాయి..

    మనతో మనం అందం గ ఆనందంగా ..ఆలోచించుకుంటూ నేను బాగున్నాను బాగుంటాను.. అందరు బాగుంటారు బాగుండాలి.. మంచి మాటనే మాట్లడడం ఇలాంటివి.. ప్రాక్టీస్ చేస్తే అద్భుతాల్ని మనమే చూడొచ్చు.. ఇది కచ్చితంగా జరుగుతుంది.. కలలు కనండి కలల్ని కలకంటూనే నిజం చేసుకోవాలి.. పంచభూతాలు సహకరిస్తాయి

     ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోండి

    ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోండి

    నేను ,, ఇది నేను నా గురించి తెలుసుకుంటున్న ప్రతి పేజీ చాల బాగుంది అనుకుంటే అంత బాగుంటుంది.. కనుక ,, ఎంత వాడాలో అంతే వాడండి తప్ప అదే పనిగా ఇందులోనే పడిఉంటే చాల నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఎపుడు ఎవరో చేసేవి , పెట్టేవి ఒక హద్దు వరకు పరవాలేదు. కనుక ఇంత అందమైన సమయాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోండి
    పనిలేదు బోర్ కొడుతోంది అందుకే.. పనికిరాని విషయాల్లో తలదూర్చేకంటే పుస్తకాలు, పూజలు,( నమ్మేవారికి ) ఆద్యాత్మికం అంటే దేవుడే కాదు నీలో నువ్వు నీతో నువ్వు నీ గుండె ఒక దేవాలయం అందులో ఎన్నో గదులు నీ మెదడు ఒక సృష్టి వెళ్లి అన్వేషించండి.

    ఈ క్షణమే వదిలేయండి..

    ఈ క్షణమే వదిలేయండి..


    నీకు నువ్వు కొత్తగా కనపడేలా ... నీలో నువ్వు ముసిరిపోయేలా గతించిన కాలం అందమైనది ఐతే తలచుకోండి నవ్వుకోండి.. నిన్ను ఏడిపించేది అయితే ఈ క్షణమే వదిలేయండి.. ఎందుకంటే గతం ఎపుడు తిరిగిరాదు కనుక.. అందరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ .. ప్రేమతో మీ మాధవీలత' అని పోస్ట్‌లో పేర్కొంది.

    English summary
    Actress Maadhavi Latha Motivation About Using Social Media. She Gave Suggestions To People On Using Smartphone And Social Media Platforms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X