For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ కదా రేటు పెంచండి! ‘తానా’ టేప్ సంచలనం, మాధవి లత ఏమన్నారంటే..

  |

  అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల ముసుగులో ఇండియా నుంచి హీరోయిన్లు, మోడల్స్‌ను అమెరికా రప్పించడం, అక్కడికి వెళ్లిన తర్వాత వారితో వ్యభిచారం చేయిస్తున్నారనే విషయం కొన్ని రోజుల క్రితం మోదుగుమూడి కిషన్ సంఘటనతో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

  తెలుగు సంఘాల ఫంక్షన్లలో పెర్ఫార్మెన్స్ చేయడానికి అని పిలిపించిన కొందరు హీరోయిన్లను బలవంతంగా వ్యభిచారంలోకి దించే ప్రయత్నం చేయడంతో అమెరికాలో జరుగుతున్న ఈ చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా లీకైన ఓ ఆడియో టేప్ సంచలనం రేపుతోంది.

  మాట్లాడింది ‘తానా’ ప్రముఖుడేనా?

  మాట్లాడింది ‘తానా’ ప్రముఖుడేనా?

  తాజాగా వెబ్ టీవీ ఛానల్ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) ప్రముఖుడు మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయట పెట్టింది. ఇందులో అతడు ఇండియా నుంచి వచ్చే అమ్మాయిలు, హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడారు. చాలా మందితో కోరిక తీర్చుకున్నట్లు.... వారిని ఇంత రేటుకు సెట్ చేసుకునేలా మధ్య వర్తితో బేరాలు ఆడినట్లు ఉంది.

  మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

   హీరోయిన్ కదా... కాస్త ఎక్కువ ఇవ్వండి!

  హీరోయిన్ కదా... కాస్త ఎక్కువ ఇవ్వండి!

  ఆ ఆడియో టేపులో మాధవి అనే పేరు వినిపించడం, ఆమెరేటు విషయంలో మధ్య వర్తితో తానా ప్రముఖుడు బేరాలు ఆడటం.... హీరోయిన్ కదా కాస్త ఎక్కువ ఇవ్వండి అని మధ్యవర్తి అడగటం లాంటి సంభాషణలు వినిపించాయి.

  మాధవి లత లైన్లోకి...

  మాధవి లత లైన్లోకి...

  ఈ నేపథ్యంలో తెలుగు నటి మాధవి లతను ఫోన్ లైన్లోకి తీసుకొచ్చిన సదరు ఛానల్ ఈ ఆడియో టేప్ గురించి స్పందించాలని కోరారు. దీనికి మాధవి లత రియాక్ట్ అవుతూ... ఒకరి గురించి మాట్లాడే ముందు, డిస్క్రషన్ పెట్టే ముందు ఎవరు యూఎస్ఏ వెళ్లారనే విషయం నిర్దారించుకోవాలని తెలిపారు.

  సొల్లు మాట్లాడుకునేవారు ఉంటారు

  సొల్లు మాట్లాడుకునేవారు ఉంటారు


  ఏ ఇష్యూలో అయినా కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. జనాలు నేను ఇంత మందితో తిరిగాను అని గొప్పగా చెప్పుకోవడానికి మాట్లాడతారు. ‘తానా' అంటే అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది మెంబర్స్ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకునే సొల్లు రికార్డ్ చేసి అది ఇప్పుడు లీక్ చేసి ఫ్రెష్ అని ప్రచారం చేస్తున్నారని మాధవి లత తెలిపారు.

  క్యారెక్టర్ మీద నింద వేస్తారు

  క్యారెక్టర్ మీద నింద వేస్తారు

  ఏదైతే భాష మాట్లాడుతున్నారో అక్కడే వారి సంస్కారం బయట పడుతోంది. ఆడియో టేపు వింటే మాట్లాడే వ్యక్తికి కల్చర్ లేదు. అమ్మాయిని బ్యాడ్ చేయాలంటే ముందు క్యారెక్టర్ చెడ్డది బ్లేమ్ చేస్తారు. వారికి అదొక్కటే మార్గం.. అని మాధవి లత అన్నారు.

  అడుక్కుని వెళ్లేవారు ఉన్నారు, అలాంటి వారే...

  అడుక్కుని వెళ్లేవారు ఉన్నారు, అలాంటి వారే...

  చాలా మంది అమ్మాయిలు అమెరికా తెలుగు సంఘాల వారిని మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుని వెళుతున్నారు. మేము దేనికైనా సిద్ధమని చెప్పి బ్రతిమిలాడి వెళుతున్నారు. అలాంటివారు కొందరు మాత్రమే ఉన్నారు. వారే ఇలాంటివి చేస్తున్నారు. చాలా మందిని మిస్ యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయని మాధవి లత తెలిపారు.

  కండీషన్స్ అప్లై అంటారు

  కండీషన్స్ అప్లై అంటారు

  రెస్పెక్టెడ్‌గా ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ కండీషన్స్ అప్లై అనే రూల్ మీద పిలుస్తున్నారు. వారి కోరికలు తీర్చకపోయినా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సరైన మేనేజర్ ద్వారా వెళితే ఇలాంటివి ఉండవని మాధవి లత స్పష్టం చేశారు.

  English summary
  Actress Madhavi Latha about TANA Leaked Audio Tape. That's not true, she said. Maadhavi Heart Latha is an Indian film actress, who has appeared in Telugu and Tamil films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X