మాధవి లత పట్టుబట్టి సాధించిందిగా.. మరోసారి 'నమో'!

Recommended Video

Actress Madhavi Latha To Contest In AP Assembly Elections 2019 || BJP || Filmibeat Telugu

టాలీవడ్ హీరోయిన్ మాధవి లత మరోమారు వార్తల్లో నిలిచారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆమె సందడి చేయబోతున్నారు. నచ్చావులే, స్నేహితుడా లాంటి చిత్రాలతో మాధవి లతహీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గత కోనేళ్ళుగా మాధవిలతకు అవకాశాలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో మాధవి లత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు, లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధం అయింది.

ఎమ్మెల్యే అభ్యర్థిగా

ఎమ్మెల్యే అభ్యర్థిగా

మాధవి లత కొన్ని నెలల క్రితం బిజెపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినీ గ్లామర్ ఆమెకు కలసి వచ్చే అంశం. బీజేపీలో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో జాక్ పాట్ కొట్టేసింది. బిజెపి అధిష్ఠానం ఆమెకు త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించింది.

 సంతోషాన్ని వ్యక్తం చేస్తూ

సంతోషాన్ని వ్యక్తం చేస్తూ

తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి టికెట్ కేటాయించడంతో మాధవి లత సంతోషాన్ని వ్యక్తం చేసింది. బిజెపి అధిష్ఠానానికి తన కృతజ్ఞతలు తెలియజేసింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి మాధవి లత బరిలో దిగబోతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణకు మాధవి లత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

మరోమారు నమో

ఈ సందర్భంగా మాధవి లత మరోమారు నమో అంటూ కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ సర్కారే రావాలని కోరింది. ఇప్పటికే రోజా, దివ్యవాణి లాంటి సినీతారలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సందడి చేస్తున్నారు. మాధవి లతా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండడం కీలకంగా మారింది. మాధవిలత పోటీ ఇతర పార్టీల అభ్యర్థులపై ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

కాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలు

కాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలు

టాలీవుడ్ లో మహిళా నటీలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో తొలి సారి స్పందించిన నటి మాధవి లత. కాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలతోనే మాధవి లత హాట్ టాపిక్‌గా మారింది. పలువురు దర్శకులు, ప్రముఖులపై మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో అవకాశాలు బాగా తగ్గడంతో మాధవి లత రాజకీయాలపై దృష్టి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X