ఆ మాట విని కడుపు కాలింది , ఆవేశం వచ్చింది.. ఆ నొప్పి నాకు తెలుసు.. మాధవీలత ఎమోషనల్ పోస్ట్
నటి, నాయకురాలు మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ద్వారా తెచ్చుకున్న క్రేజ్ తక్కువే అయినా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెచ్చుకున్న పాపులార్టీనే అధికం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మాధవీలత నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సమాజంలో జరిగే అంశాలపై తన వైఖరిని చెబుతూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య వరుసగా పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య వరుస పోస్ట్‌లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

కాంట్రవర్సీ పోస్ట్‌లు..
సాధినేని యామినిని బీజేపీలో చేర్చుకోవడంపై మాధవీలత ఫైర్ అయింది. ఈ క్రమంలో సాధినేనికి మద్దతిస్తూ.. మాధవీలతను శ్రీ రెడ్డి టార్గెట్ చేసింది. తనపై కామెంట్ చేయడంతో మాధవీలత సైతం శ్రీ రెడ్డిని పరోక్షంగా కామెంట్ చేసింది. అంతేకాకుండా చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయాలపైనా ఓ పోస్ట్ చేసింది. కరోనా వైరస్‌పై చేసే పోరాటంలో భాగంగా విరాళాలను కూడా సేకరిస్తోంది. రీసెంట్‌గా వైన్స్ షాప్ ఓపెన్ చేయడంపై సెటైరికల్‌గా స్పందించింది.

ఓ నాయకుడు అలా అన్నాడు..
నాతో ఓ పెద్ద మనిషి ఒక మహానుభావుడు ఒక రాజకీయ నాయకుడు అన్న మాట. ఆర్మీ వాడైతే బోర్డర్ లో వెళ్లి డ్యూటీ చేస్కోమను, సమాజం లో ఎం జరిగితే వీడికెందుకు ?, రాజకేయం మీద కామెంట్ చేసే హక్కు వీడికి ఏముంది ??. "ఎదో వీళ్ళే పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తునట్లు ""

కడుపు కాలింది..
ఈ మాట విని కడుపు కాలింది , ఆవేశం వచ్చింది , కానీ ఏమి చేయలేను అధికారం లో ఉన్న నాయకుడు. గట్టిగ అనుకున్న తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలతన్నే వాడు పుడతాడు అనిఆ రోజు వాడిది రేపు నాది అనుకున్న దేశాన్ని ఉద్దరించేది కాపాడేది ఇండియన్ ఆర్మీ ఒకటే
Recommended Video

ఆ నొప్పి నాకు తెలుసు..
ఇది ఎప్పటికైనా ఆ నాయకుడికి తెలియచెప్పాలి అనే కసి తో ఉన్న ....దేనికైనా సమయం రావాలి మిత్రమా. ఇలా ఆర్మీ కి పంపిన బిడ్డ కోసం ప్రతి తల్లి తపన. అందులో మా అమ్మ కూడా ఉందిఆ నొప్పి నాకు తెలుసు. నిజమే చిన్న రోగం వస్తే బతకాలి , ఇపుడు కరోనా వాళ్ళ బయపడేదే ప్రాణం కోసం. మనిషి విలువ ఎపుడు గొప్పదే. మన కోసం ప్రాణాలు అర్పించేవారికోసం మనం మనుషులుగా బతకాలి


Click it and Unblock the Notifications











