కరోనాకు మందు దొరికేసింది.. యురేకా సకా మికా.. మాధవీలతా పోస్ట్ వైరల్
కరోనా వైరస్ ప్రపంచాన్ని గుప్పిట్లో పట్టి పీడిస్తోంది. కరోనాను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ మేరకు భారతదేశం కూడా గత 45 రోజులుగా లాక్ డౌన్‌ను పాటిస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ దెబ్బతో ఇన్ని రోజులు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కొన్ని రాష్ట్రాలు మద్యం షాపులు ఓపెన్ చేయడంతో జనం తండోపతండాలుగా రోడ్ల మీదకు వచ్చారు. జాతరను తలపించేలా వైన్ షాపుల ముందు విన్యాసాలు చేశారు. వీటిపై నటి, నాయకురాలు మాధవీలత స్పందించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండే మాధవీలత.. తన అభిప్రాయాలను వెల్లిబుచ్చుతూ ఉంటుంది. సమాజంలో జరిగే అంశాలపై తన వైఖరిని చెబుతూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య వరుసగా పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

కాంట్రవర్సీ పోస్ట్‌లు..
సాధినేని యామినిని బీజేపీలో చేర్చుకోవడంపై ఫైర్ అయిన మాధవీలతను శ్రీ రెడ్డి టార్గెట్ చేసింది. తనపై కామెంట్ చేయడంతో మాధవీలత సైతం శ్రీ రెడ్డిని పరోక్షంగా కామెంట్ చేసింది. అంతేకాకుండా చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయాలపైనా స్పందించింది. కరోనా వైరస్‌పై చేసే పోరాటంలో భాగంగా విరాళాలను కూడా సేకరిస్తోంది. తాజాగా వైన్స్ షాప్ ఓపెన్ చేయడంపై సెటైరికల్‌గా స్పందించింది.

సాధారణ దుకాణాలు ..?
ఓ తాగుబోతూ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘పర్ఫెక్ట్.. ఇదో స్వర్గం.. లాక్ డౌన్ నరకానికి వెళ్తుంది.. మరి కరోనా? మందు షాపులు ఓపెన్ చేసినప్పుడు.. సాధారణ దుకాణాలు ఎందుకు ఓపెన్ చేయకూడదు?.. అవి మాత్రమే కరోనా బారిన పడతాయా? అంటూ ప్రశ్నించింది.

లిక్కరే ఓ మంచి మందు..
కరోనాకు లిక్కరే ఓ మంచి మందని నేను నమ్ముతున్నాను. ఇండియా మందు కనిపెట్టింది.. యురేకా సకా మికా.. ఎవ్వరైతే లైన్లో నిల్చొని మందు కొనుక్కుని తాగుతున్నారో వారిని కరోనా ఏం చేయదు.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇండియా వైపు గర్వంగా చూస్తోంది. ఇండియాలోని ముఖ్యమంత్రులెంతో గొప్ప నాయకులు.. నేను ముగ్దురాలినయ్యాను.
Recommended Video

మొరిగే కుక్కులు అటాక్ చేయండి..
మొరిగే కుక్కలకు చెబుతున్నా.. మద్యం వల్ల వచ్చిన లాభాలు రాష్ట్రాలకే చెందుతాయి.. అంతేకాని కేంద్రానికి కాదు. కొన్ని రాష్ట్రాలు అడగడంతోనే కేంద్రం సడలింపులు ఇచ్చింది. రాష్ట్రాల నిర్ణయాల మేరకే లిక్కర్ షాపులు ఓపెన్ అయ్యాయి. ఇక ఇప్పుడు మొరిగే కుక్కులు అటాక్ చేయండ'ని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











