twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాధవి లత... పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్!

    By Bojja Kumar
    |

    మొన్నటి వరకు పవన్ కళ్యాణ్‌కు ఫేవర్‌గా మాట్లాడిన నటి మాధవి లత ఆయనకు మద్దతుగా సైలెంట్ ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అపుడు మాధవి లత తీరు చూసిన చాలా మంది జనసేన పార్టీ వైపు వస్తారని భావించారు. అయితే అందరికీ షాకిస్తూ ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకు ఇలా చేశారు? అనే ప్రశ్నకు ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, కానీ

    పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, కానీ

    పవన్ కళ్యాణ్ అంటే అపుడూ ఇష్టం, ఇప్పుడూ ఇష్టం... రేపు కూడా ఆ ఇష్టం అలానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద ఇష్టం పోవడం అనేది ఎప్పుడూ జరుగదు.... అంటూ మాధవి లత వ్యాఖ్యానించారు.

    పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయొద్దనే రూల్ ఏమైనా ఉందా?

    పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయొద్దనే రూల్ ఏమైనా ఉందా?

    మరి అపుడు ఎందుకు పవన్ కళ్యాణ్, జనసేనకు సపోర్ట్ చేశారు? అంటే.... ‘చేయకూడదని ఎక్కడా రూల్ లేదు కదా' అంటూ గడుసుగా సమాధానం ఇచ్చారు. నేనెక్కడా జనసేనలో జాయిన్ అవుతున్నాను, అవుతాను అనే స్టేట్మెంట్స్ ఇవ్వలేదు అని మాధవి లత అన్నారు.

     పవన్ కూడా అపుడు సపోర్టు చేశారనే విషయం మరువద్దు

    పవన్ కూడా అపుడు సపోర్టు చేశారనే విషయం మరువద్దు

    పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టిన కొత్తలో మోడీగారికి సపోర్ట్ చేశారు. ఆయన ఐడియాలజీ నచ్చిది కాబట్టే చేశారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. అదే సమయంలో బీజేపీ పార్టీ, మోడీ చేస్తున్న పనులు నచ్చాయి కాబట్టి నేను సపోర్టు చేస్తున్నాను అని మాధవి లత తెలిపారు.

    అపుడు మీడియా ఎందుకు కవర్ చేయలేదు?

    అపుడు మీడియా ఎందుకు కవర్ చేయలేదు?

    పవన్ కళ్యాణ్ కోసం ర్యాలీ చేస్తున్నానంటే మీడియా మొత్తం పరుగెత్తుకొచ్చింది. ఆసిఫా కోసం ర్యాలీ చేస్తుంటే ప్రతి మీడియా కవర్ చేసింది, మరి ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? ఎవరెవరియో నాన్ సెన్స్ డిబేట్లు పెట్టుకుని కూర్చున్నారు.... అంటూ ఓ ప్రశ్నకు ప్రశ్నకు మాధవి లత ఘాటుగా సమాధానం ఇచ్చారు.

    English summary
    Actress Madhavi Latha joins BJP and Interesting Comment On Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X