twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాడ్లు దించుతారా? ఎక్కడ దించుతారో.. ఏం పీకుతారో చూస్తా.. వైసీపీపై నిప్పులు చెరిగిన మాధవీలత

    |

    సోషల్ మీడియాలో తనపై నీచంగా పోస్టులు పెడుతున్న కొన్ని పార్టీల వారిపై సినీ నటి, రాజకీయ నేత మాధవీలత ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న వారిపై ఆమె ఇటీవల సైబర్ క్రైమ్‌తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌తోపాటు పలు పార్టీల కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే..

    తిరుగుబొతు.. బిచ్ అంటూ కామెంట్లు

    తిరుగుబొతు.. బిచ్ అంటూ కామెంట్లు

    సోషల్ మీడియాలో నాపై పిచ్చి పిచ్చి పోస్టుల పెడుతున్నారు. చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమా తారను కావడంతో తిరుగుబోతు అని, బిచ్ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో ఎంత సేపు ఆడవాళ్ల మీద, ఆడవాళ్ల బతుకు మీద పడి డబ్బులు సంపాదిస్తున్నారు అని సినీ నటి మాధవీలత ఘాటుగా స్పందించారు.

    రాజకీయ నేతల కుంభకోణాలపై రాయరా?

    రాజకీయ నేతల కుంభకోణాలపై రాయరా?

    సినీ తారలను టార్గెట్ చేస్తూ.. ఫలానా హీరోయిన్ ఎక్కడో పట్టుబడింది. ఫలానా సినీ నటి మరొక్కడో పట్టుబడింది అంటూ రాతలు రాస్తుంటారు. అదే ఓ టెర్రరిస్టును పట్టుకొంటే కనీసం గొప్పగా చూపించరు. ఓ దుర్మార్గుడిని పట్టుకొంటే కనీసం వార్త కూడా వేయరు. అవినీతి చేసే రాజకీయ నాయకుల గురించి రాయరు. కుంభకోణాలు చేసే వారి గురించి ఒక పోస్టు కూడా పెట్టరు అంటూ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

    డ్రగ్స్ కేసును అలా మూసేస్తారా?

    డ్రగ్స్ కేసును అలా మూసేస్తారా?

    మహిళలను టార్గెట్‌గా చేసుకొంటూ పబ్బం గడుపుతున్నది. డ్రగ్స్ కేసును కూడా మూడు రోజుల్లోనే క్లోజ్ చేశారు. ఎవరో మీడియా నొక్కేశారని ఆ కేసును బయటకు రాకుండా చేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వారు రకరకాలుగా నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ మాధవీ లత భగ్గుమన్నారు.

    ఆలయాలపై దాడులు చేస్తే మాట్లాడొద్దా?

    ఆలయాలపై దాడులు చేస్తే మాట్లాడొద్దా?

    నేను ఆలయాలపై దాడులు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో చాలా దారుణంగా కామెంట్లు చేశారు. రాడ్లు దించుతాం. రోడ్డుపై కనపడితే పిచ్చ కొట్టుడు కొడుతామని పోస్టులు పెడుతున్నారు. వారు ఏమనుకొంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. వాళ్లు ఎక్కడ రాడ్లు దించుతారో చూస్తా. నా జోలికి వస్తే నేను నోర్మూసుకొని ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు అంటూ మాధవీలత హెచ్చరించారు.

    హిందువని గొప్పగా చెప్పుకొంటా

    హిందువని గొప్పగా చెప్పుకొంటా

    ఆంధ్రాలో దేవాలయాలపై దాడుల చేస్తున్న సమయంలో ఓ హిందూ మతానికి చెందిన మహిళగా నేను స్పందించాను. నేను హిందువునని గొప్పగా చెప్పుకొంటాను. ఎవరేం పీకుతారో నేను చూస్తాను. మా దేవాలయాల మీద ఎటాక్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడటం తప్పా? అని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Actress Madhavi Latha made serious comments on YSRCP over social media attack. She filed a complaint in Cyberabad police over Social media post on her. He warned few political parties over the derogatory comments on her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X