సెక్స్ రాకెట్: అమెరికాకు వెళ్ళా, భయంతో పరుపుకింద.. అమ్మాయి ఒంటరిగా దొరికితే.. మాధవీలత
Recommended Video

టాలీవుడ్ చిత్రపరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నిటి వరకు కాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ ని కుదిపేసింది. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో జరుగుతున్న ప్రతి అంశం గురించి తన అభిప్రాయం వివరించే మాధవీలత.. ఈ సెక్స్ రాకెట్ గురించి కూడా స్పందించింది. గత ఏడాది అమెరికా వెళ్లిన నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాన్ని మాధవీలత వివరించింది.

గత ఏడాది అమెరికాకు వెళ్ళా
తాను 2017 లో ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లానని మాధవీలత తెలిపింది. ఈవెంట్ కోఆర్డినేటర్లుగా కిషన్, చంద్ర ఉన్నారని తెలిపింది. అక్కడ జరుగుతున్న పరిణామాల అనుమానంగా ఉండడంతో తన జాగ్రత్తల్లో తాను ఉన్నానని మాధవీలత తెలిపింది.

హౌస్ అరెస్ట్ చేశారు
అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి బయట చెబుతానేమోనని భయంతో తనని దాదాపు హౌస్ అరెస్ట్ చేసినంత పని చేసారని మాధవీలత తెలిపింది. తాను తీవ్రమైన మెడనొప్పితో భాదపడ్డప్పటికీ కనీసం చికిత్స కూడా చేయించలేదని మాధవీలత తెలిపింది.

20 రోజులపాటు
ఆ సమయంలో తాను అమెరికాలో 20 రోజులు గడిపినట్లు మాధవీలత తెలిపింది. అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఇక జీవితంలో అలాంటి ఈవెంట్స్ కు వెల్ళకూడదని నిర్ణయించుకున్నట్లు మాధవీలత తెలిపింది.

కిషన్, చంద్ర
తన మెడ నొప్పి విషయం కిషన్, చంద్రకు చెప్పినా పట్టించుకోలేదు. ఇండియా వెళ్ళాక చికిత్స చేయించుకోమని సలహా ఇచ్చినట్లు మాధవీలత తెలిపింది. వారం రోజుల పాటు మందులు వాడాక ఇండియా తిరిగి వచ్చానని మాధవీలత తెలిపింది.

అమ్మాయిలదే తప్పు అనే ముద్ర
చికాగో సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న హీరోయిన్లు, ఇతర అమ్మాయిలదే తప్పు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని మాధవీలత మండిపడింది. హీరోయిన్లు డాలర్స్ సంపాదించుకునే ఉద్దేశంతో, పరస్పర అవగాహనతోనే వెళుతున్నారనే ముద్ర వేస్తున్నారు.

అలా మాట్లాడుతున్న వారే
హీరోయిన్ల గురించి తప్పుగా మీడియాలో మాట్లాడుతున్న వారే ఒంటరిగా అమ్మాయి దొరికితే గోకుతారని మాధవీలత వ్యాఖ్యానించింది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని మాఫియాగా గుర్తించాలని మాధవీలత తెలిపింది.

పాస్ పోర్ట్ లాగేసుకుని
ట్రాప్ లోకి నటీమణులని దించి అమెరికాకు రప్పించి పాస్ పోర్ట్ లాగేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తాను విన్నానని మాధవీలత తెలిపింది. తాను అమెరికాకు వెళ్లిన సమయంలో కూడా పాస్ పోర్ట్ పరుపుకింద దాచుకునేదాన్ని అని మాధవీలత తెలిపింది.

మాట్లాడడం లేదు
అమెరికాకు వెళ్లి వచ్చిన నటీమణులు ఈ విషయం గురించి ధైర్యంగా మాట్లాడడం లేదని.. మాకెవరికి ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని తప్పించుకు తిరుగుతున్నారని మాధవీలత తెలిపింది.


Click it and Unblock the Notifications











