twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ చేస్తే మీకేం నొప్పి.. మీరు పీకడానికి? పర్సనల్ లైఫ్ వద్దు.. మాధవీలత వార్నింగ్

    |

    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా తెలుగుదేశం నేత యామిని సాదినేనిపై సినీ నటి మాధవీలత పరోక్ష వ్యాఖ్యలు సంధించారు. అంతుకు ముందు ఏం జరిగిందేదో తెలియదు కానీ. మల్లెపూల విషయం ఏంటో దగ్గరిని నుంచి యామిని సాదినేని చూశారేమో. అలా చూస్తూ అప్పడే అడగాలి కదా? ఇప్పుడుఎందుకు అడగడం అంటూ ఫేస్‌బుక్‌లో మాధవీలత స్పందించింది. ఫేస్‌బుక్ ఆమె చేసిన పోస్టు ఇలా..

    వారసత్వం గురించి

    వారసత్వం గురించి

    వారసత్వం గురించి మాట్లాడే హక్కులేదా? నిజమే. ఎందుకంటే ఆయన (పవన్ కల్యాణ్) వారసత్వంతో రాలేదు కదా. కవాతు దేనికోసమా? ఏం చేసేద్దామనా? ఏం చేయలేదమ్మా? మీరు చేయలేనివి ఆయన చేద్దామని తపన అంతే. ప్రజల కోసం మీరు చేయరు. పక్కన వాళ్లు చేస్తే నొప్పి వస్తుంది ఎందుకో అని మాధవి లత ధ్వజమెత్తారు.

    వ్యక్తిగత జీవితం మీద పడొద్దు

    వ్యక్తిగత జీవితం మీద పడొద్దు

    ప్రతీ ఒక్కడు ఆయన (పవన్ కల్యాణ్) వ్యక్తిగత జీవితం మీద పడి ఏడుస్తుంటారు. ఎందుకంటే అంతకంటే మీకు పీకడానికి ఏమీ లేదు కదా. ఆయనపై చేయడానికి వేరే ఆరోపణలు లేవు కదా. మొన్నటి దాక బీజేపీ డబ్బులు తీసుకొన్నాడు. నిన్నఏమో ఎవడో డబ్బులు ఖర్చుపెడుతున్నాడు. మీ అయ్యలు ఇచ్చారా? మీ తాతలు ఇవ్వలేదు గదా.. మీకు నొప్పి ఎందుకు అని మాధవీ లత ఆగ్రహం వ్యక్తం చేసింది.

     పవన్‌పై ఎందుకు ఏడుస్తారు

    పవన్‌పై ఎందుకు ఏడుస్తారు

    పవన్ అసలు మీద పడి ఎందుకు ఏడుస్తారు? పైసలు పంచిపెట్టకుండా అంత మంది ఎలా వచ్చారా అని బాధపడుతున్నారా?. అంతమందిని చూస్తే కడుపులో మంట ఉంటుందిలే. ఆ నొప్పి తాగడానికి ఇనో అనే మందు ఎప్పటి నుంచో ఉంది. అది తాగండి అది తగ్గుతుంది అని మాధవీ లత సలహా ఇచ్చింది.

    ఇకనైనా తెలుసుకోండి

    ఇకనైనా తెలుసుకోండి

    ప్రతిపక్షం అంటే ప్రశ్నించాలి. ఆ పని చేయకపోతే ఇక అంతే. అసలు మాట్లాడకుండా ఆపడం పద్దతి కాదు. ఇప్పటికైనా నేర్చుకొండి అంటూ మాధవీలత గరం అయ్యారు. ఇలా పవన్ పేరు ఎత్తకుండానే ఆయనపై విమర్శలు చేస్తున్న వారికి మాధవీ లత ఝలక్ ఇవ్వడంపై ఫ్యాన్స్ అభినందించారు.

    English summary
    Actress Madhavi Latha responded to TDP leaders criticism. He warn not to target pawan personal life. Why you are criticising the pawan without reason.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X