‘అందుకే అల్లు అర్జున్, సుకుమార్ బాధితురాలకు సపోర్ట్ చేశారు’: నాగ బాబుకు మాధవిలత స్ట్రాంగ్ కౌంటర్..
Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ తనని లైంగిక వేధించాడని, పలుమార్లు తనపై అత్యాచారం చేశారని లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొంతమంది బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే..మరికొందరూ మాత్రం జానీ మాస్టర్ కు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, బీజేపీ నేత మాధవీలత (Madhavi Latha) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జానీ మాస్టర్ కు సపోర్టుగా మెగా బ్రదర్ నాగబాబు పోస్ట్ చేయడంతో తనకు నచ్చలేదనీ, ఆ విషయంలో తాను బాధపడ్డానని చెప్పుకొచ్చింది మాధవి లత. నటుడు నాగబాబు కూడా ఒక కూతురు ఉంది కదా.. తన కూతురి కంటే బాధితురాలు చాలా చిన్నదని కౌంటర్ ఇచ్చారు. అలాగే.. మహాసేన రాజేష్ కూడా కౌంటర్ ఇచ్చారు.

జానీ మాస్టర్ కు సపోర్ట్ గా మాట్లాడుతూ.. తన ఫాలోవర్స్, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనీ, ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయమన్నారు. మీ ద్రుష్టిలో జానీ మాస్టర్ మంచివాడు అయి ఉండవచ్చు. కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం అతను మంచి వ్యక్తి కాదని అర్థమవుతుంది కదా. సాక్ష్యంగా నేను ఉన్నాను సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలున్నాయి. జానీ ఎలాంటి వాడో నాకు తెలుసు అని కౌంటర్ ఇచ్చారు.
ఆమె ఇంకా మాట్లాడూతూ.. ' ఆ అమ్మాయి 16 లేదా 17 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సమయంలో జానీ మాస్టర్ మాయ మాటలు నమ్మి అతనితో ఓ ఆరు నెలలు రిలేషన్ లో ఉంది. ఆ మాటలకు ఆమె మోసపోయింది. ఆ తర్వాత అతడి నిజస్వరూపం తెలుసుకొని బయటకు వచ్చింది. ఇండిపెండెంట్ గా పనిచేయడం చేస్తుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి టీనేజర్.. ఇప్పుడిప్పుడే 22 సంవత్సరాలు. ఆమె ఇండిపెండెంట్ గా పనిచేయడం జానీ మాస్టర్ కి ఇష్టం లేదనుకుంటా బహిరంగంగా కూడా ఆమెను చాలా టార్చర్ చేశాడు.'అని పేర్కొంది.
పుష్ప 2 షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి పనిచేస్తుంటే.. అక్కడికి జానీ మాస్టర్ వచ్చి గొడవ పడ్డారు. నానా రచ్చ చేశారు. ఆ సమయంలో సుకుమార్ గారే ఆ పంచాయితి పెట్టి ఆ గొడవను క్లియర్ చేశారు. ఆ సినిమా షూట్ లో ఇంత పెద్ద గొడవ జరిగింది. ఆ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు కాబట్టే.. అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఆ అమ్మాయికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఆ తరువాత విశ్వక్ సేన్ సినిమా సైట్ లో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఇవన్నీ తెలుసుకుని మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ ని సస్పెండ్ కూడా చేశారు అని షాకింగ్ విషయాలను వెల్లడించారు మాధవీలత.
' ఆ అమ్మాయికి వందల మెస్సెజ్ పంపిస్తారు. నువ్వంటే.. ఇష్టం.. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. నువ్వు లేకుంటే నేను బతకలేను' అంటూ షూటింగ్ ల దగ్గర ఆమెను జానీ మాస్టర్ ఎన్నోసార్లు అవమానించారు. అంతే కాదు ఆమెను ఎన్నోసార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు, చాటింగ్ , కాల్ రికార్డింగ్స్ ఆధారంగానే ఆ అమ్మాయి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. అందుకే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అని పలు సంచలన విషయాలను వెల్లడించింది.
'నిజానిజాలు తెలుసుకోకుండా.. అమ్మాయిపై నిందాలు వేయడం సరికాదనీ, తప్పు ఎవరూ చేసిన తప్పేనన్నారు. మీ విషయంలో మీరు స్నేహితుడే కావచ్చు. ఆప్తుడే కావచ్చు. కానీ, ఆ అమ్మాయి విషయంలో మాత్రం ఆ వ్యక్తి మాత్రం విలనే.. నిజానికి టాలెంట్ వేరు క్యారెక్టర్ వేరు కదా.. ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు ఎవరు కూడా ఆమెను బలవంతం చేయకూడదు. నలుగురులో అవమానించడం, సినిమా అవకాశాలు రాకుండా చేయడం ఏ మాత్రం సరికాదు.' అంటూ.. ఇన్ డైరెక్ట్ గా నాగబాబుకి గట్టి కౌంటర్ ఇచ్చింది నటి మాధవి లత.


Click it and Unblock the Notifications











