Don't Miss!
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తెలుగు హీరోయిన్ కు అశ్లీల SMS లు..వార్నింగ్
హైదరాబాద్ :శృతిహాసన్ ఉదంతం మరవక ముందో మరొకటి వెలుగులోకి వచ్చింది. తన సెల్‌ఫోన్ కు గత కొంతకాలంగా అశ్లీల SMS లు పంపుతున్న వ్యక్తిని తెలుగు హీరోయిన్ మధురిమ పట్టుకుంది. అతనెవరో కాదు ఆమె మాజీ మేనేజరే కావటంతో షాక్ అయ్యింది. తనపై దుష్ర్పచారం చేస్తున్న తనమాజీ మేనేజర్‌పై మధురిమ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి పనులు ఆగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇంతకుముందు నటి శృతిహాసన్, రమ్య తదితర హీరోయిన్లకు ఇలా అశ్లీల ఎస్ఎంఎస్లు పంపి అల్లరి చేసిన ఆకతాయిలపై ఫిర్యాదు చేయగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా నటి మధురిమపై ఆమె మాజీ మేనేజర్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిసి ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చాలా మందికి ఆ మేనేజర్ పరిచయమే.
'ఆ..ఒక్కడు' చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన మధురిమ ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సరదాగా కాసేపు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన 'మహంకాళి', వెంకటేష్ హీరోగా వచ్చిన 'షాడో' చిత్రంలో శ్రీకాంత్ సరసన అవకాశం దక్కించుకున్నా ఆ సినిమా ఫట్ మనడంతో అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు.
ప్రస్తుతం అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్న భామల లిస్టులో మధురిమ కూడా చేరి పోయింది. ఆకట్టుకునే అందం, విచ్చలవిడిగా అందాలు ఆరబోసే తెగువ, నటనలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ పాపం మధురిమకు కాలం కలిసి రాలేదనే చెప్పాలి. పరిశ్రమలో కొత్త భామల తాకిడి పెరిగి పోవడం కూడా...మధురిమ లాంటి వారికి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణమవుతోంది.