సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఉరి వేసుకొని యువ నటి ఆత్మహత్య!

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ నటి, సింగర్ మాలిక రాజ్‌పుత్ అలియాస్ విజయలక్ష్మీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సంచలనంగా మారింది. ఆమె మరణంపై అనేక సందేహాలు వ్యక్తం కావడంతో బీహార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మాలికా రాజ్‌పుత్ ఉంటున్న గదిలో ఎంతకు ఓపెన్ చేయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. వెంటనే హస్పిటల్‌కు తరలించగా అప్పటికే తుది శ్వాస విడిచారని వైద్యులు ధృవీకరించారు.

Actress Malika Rajput alias Vijaya Lakshmi died Hanging to Fan in Sitakund of Uttarpradesh

ప్రస్తుతం మాలికా రాజ్‌పుత్ భౌతికకాయాన్ని హాస్పిటల్‌కు తరలించి పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ నివేదికల ఆధారంగా ఆమె మరణానికి కారణాన్ని అధికారికంగా ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ విషాద ఘటన సీతాఖండ్‌లోని కోత్వాలీ నగర్‌లో జరిగింది. ఈ వార్తతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు.

మలికా రాజ్‌పుత్ తల్లి సుమిత్రా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ దారుణం ఎప్పుడు జరిగిందో తెలియదు. తలుపులు మూసి లైట్లు వేసి ఉన్నాయి. మూడు, నాలుగు సార్లు తలుపులు బాదినాం. కానీ చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చింది. కిటీకీలో నుంచి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే నా భర్తను పిలిచి తలుపు పగలగొట్టి బయటకు తీసుకు రాగా అచేతనంగా పడి ఉంది అని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన నటి మాలికా రాజ్‌పుత్ వర్థమాన తారగా రాణిస్తున్నారు. ఆమె వయసు 35 సంవత్సరాలు. కంగన రనౌత్‌తో కలిసి రివాల్వర్ రాణి అనే చిత్రంలో నటించారు. నటిగానే కాకుండా గాయకురాలిగా ఆమె సుపరిచితులు. పాపులర్ గాయకుడు షాన్‌తో కలిసి యారా తుజే అనే ఆల్బమ్ కోసం పాటలు పాడారు. ఆమె కథక్ నృత్యంలోను ప్రావీణ్యం ఉంది. పలు గజల్స్‌ను కూడా ఆలపించారు.

Actress Malika Rajput alias Vijaya Lakshmi died Hanging to Fan in Sitakund of Uttarpradesh

ఇదిలా ఉండగా, సినీ పరిశ్రమతోనే కాకుండా రాజకీయాల్లోను మలికా రాజ్‌పుత్ అడుగుపెట్టారు. 2016 సంవత్సరంలో బీజేపీలో చేరి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు. కానీ రెండేళ్ల తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ఆమె మరణంపై సినీ వర్గాల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X