»   » మంచు లక్ష్మి, జయప్రదలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్

మంచు లక్ష్మి, జయప్రదలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం కారణంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తీవ్రతరం చేసారు. అయినప్పటికీ పలువురిలో మార్పు రావడం లేదు. వీకెండ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా బ్రీత్ అనలైజర్ పరీక్షలకు పోలీసులకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంపై అవగాహన కల్పించడంలో భాగంగా పోలీసులు సినీ నటుల సహాయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ‘ఐ సపోర్ట్ ట్రాఫిక్ పోలీస్' కార్యక్రమంలో సినీ నటీమణులు మంచు లక్ష్మి, జయప్రద పాల్గొన్నారు.

manchu lakshmi

జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా అటువైపుగా వచ్చిన మంచు లక్ష్మి, జయప్రదతో పాటు పలువురిని పరీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దు, కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారనే విషయం మరిచి పోవద్దు అని అన్నారు.

English summary
Actress Manchu Lakshmi, who had come for Drunk and Drive counseling, took drunk and drive test. Looking at the crowd thronged to see her, Manchu Lakshmi went soon after talking to media.
Please Wait while comments are loading...