సెట్‌లో అలా పిలిచాడు.. శేఖర్ మాస్టర్ నిజ స్వరూపం అదే.. నాటి హీరోయిన్ కామెంట్స్

మనసిచ్చాను సినిమాతో హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చిన మణి చందన.. పెళ్లి అనంతరం సినిమా రంగానికి దూరమైంది. అయితే మళ్లీ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో తన సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. అందులో భాగంగా రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం నాటి సంగతులు, శేఖర్ మాస్టర్ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది. ఆ సంగతులేంటో ఓ సారి చూద్దాం.

అలా ఎంట్రీ..

అలా ఎంట్రీ..

తొలిప్రేమ సినిమాలో మొదటగా ఓ చిన్న పాత్రలో చేశానని చెప్పుకొచ్చింది. అలా ఉండగా ఓ రోజులో సెట్‌లో చిరంజీవి తనను చూసి హీరోయిన్ అవుతావని జోష్యం చెప్పారట. అంతేకాకుండా చిరు వద్ద ఉండే ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు కూడా తీయించారట. అలా చిరంజీవి ప్రోత్సాహంతో హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలిపింది. చిరు సలహా మేరకు నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాని పేర్కొంది.

 రాకేష్ మాస్టర్ వద్ద..

రాకేష్ మాస్టర్ వద్ద..


రాకేష్ మాస్టర్ వద్ద డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాని పేర్కొంది. రాకేష్ మాస్టర్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అని, చెప్పిన మూమెంట్స్ నేర్చుకోకపోతే కోపగించుకునేవారని, ఆయన భయానికే తాము తొందరగా నేర్చుకునేవారమని తెలిపింది. లయ, ప్రత్యూష తన డ్యాన్స్ మేట్స్ అని, ప్రత్యూష చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే శేఖర్ మాస్టర్ కూడా ఉండేవాడని తెలిపింది.

ఆచారి షూటింగ్..

ఆచారి షూటింగ్..

తాను రీ ఎంట్రీలో భాగంగా ఆచారి అమెరికా యాత్ర సినిమాను చేస్తున్నానని, అమెరికాలో ఓ పాట షూటింగ్ అని నాటి సంగతులను చెప్పింది. అయితే ఆ పాటకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అని, చాలా రోజులు అవుతుంది, గుర్తున్నానో లేనో అని తాను మొదటగా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.

అలా పిలిచాడు..

అలా పిలిచాడు..

పాటలో తన పొజిషన్ మార్చాల్సి వచ్చిందని, అయితే ఒక్కసారిగా మనిషా అటు వెళ్లు అని అన్నాడని తెలిపింది. మనీషా ఎవరని అక్కడి వారంత ప్రశ్నిస్తే.. మణి చందనను తాము మనీషా అనే పిలిచేవాళ్లమని నాటి విషయాలను చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఆమె మాకు ఎంతో సాయం చేసిందని, వాళ్ల అమ్మ కూడా ఎంతో బాగా చూసుకునేదని ప్రతీ ఒక్క విషయాన్ని చెప్పుకొచ్చాడట.

Recommended Video

Happy Birthday Maniratnam : Maniratnam Biggest Multistarer Plan Got Shelved
గుర్తు పెట్టుకున్నాడు..

గుర్తు పెట్టుకున్నాడు..

అప్పటి విషయాలన్నీ గుర్తు పెట్టుకున్నాడని, శేఖర్ మాస్టర్ ఏం మారలేదని, అలానే ఉన్నాడని మణి చందన చెప్పుకొచ్చింది. శేఖర్ మాస్టర్ చాలా గొప్పొడు అని అందుకే ఎంత స్టార్డమ్ వచ్చినా అప్పటివి గుర్తుపెట్టుకున్నాడని ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X