Meena: భర్త మరణం తరువాత రెమ్యునరేషన్ పెంచిన మీనా.. ఆర్థిక పరిస్థితుల వల్లనే ఇలా..

మీనా పేరు ఇటీవల కాలంలో సౌత్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. గతంలో కంటే ఆమె ఇప్పుడు నటిగా ఎక్కువ స్థాయిలో బిజీగా మారిపోయింది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ వెలుతోంది. భర్త మరణం తరువాత కొంత డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా ఆ తరువాత తన కూతురు భవిష్యత్తు కోసం సినిమాల్లో మరింత బిజీగా మారింది.

అయితే ప్రస్తుతం ఆమె గతంలో కంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్క సినిమాకు ఏ రేంజ్ లో పారితోషికం అందుకుంటోంది అనే వివరాల్లోకి వెళితే..

నటనలో ఆల్ రౌండర్

నటనలో ఆల్ రౌండర్

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును అందుకున్న మీనా ఆ తరువాత 16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. నటనలో సహజత్వం అమాయకత్వం మాత్రమే కాకుండా పొగరున్న అమ్మాయిల తరహాలో ఎన్నో పాత్రలు చేసి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నటన విషయంలో మాత్రం ఎప్పుడు కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకునేది.

టాలీవుడ్ లో బిగ్ మూవీస్

టాలీవుడ్ లో బిగ్ మూవీస్

ఇక మీనా సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగు తమిళ్ లో ఆమె బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం, వెంకటేష్ చంటి వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. అలాగే నాగార్జున, బాలకృష్ణ లతో కూడా పలు సినిమాలు చేసింది.

వయసు పెరుగుతున్నా..

వయసు పెరుగుతున్నా..

ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా మీనా అదే తరహా అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి కూడా ఆమె డిఫరెంట్ కంటెంట్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తోంది. దృశ్యం సీరీస్ తో ఆమె మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ రెండు భాషల్లో కూడా మీనా ఎప్పటికీ మంచి పాత్రలు చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది.

భర్త మరణంతో..

భర్త మరణంతో..

ఈ ఏడాది జూన్ లో మీనా జీవితంలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణం వలన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

2009లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విద్యాసాగర్ ను ప్రేమించి వివాహం చేసుకున్న మీనాకు ఒక కూతురు కూడా ఉంది. ఆనందమైన ఫ్యామిలీతో కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా భర్తను కోల్పోవడం వలన మీనా కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.

అందులో నిజం లేదు

అందులో నిజం లేదు

ఇక మీనా లైఫ్ కు సంబంధించిన అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందని కొన్ని అబద్ధపు ప్రచారాలు కూడా వచ్చాయి. కానీ అవి నిజం కాదని ఆమె చెప్పింది. ఆమె ఆర్ధికంగా కూడా బాగుండాలి అని ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మీనా భర్త మరణం కంటే ముందు వరకు కూడా రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేకుండా కాస్త తక్కువ ఇచ్చినా కూడా తీసుకుంటూ సినిమాలు చేసిందని టాక్ వచ్చింది.

రెమ్యునరేషన్ ఎంతంటే..

రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక ఇప్పుడు తన కూతురు భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి మీనా తనకున్న డిమాండ్ మేరకే రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఒక్క సినిమాకు 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అనవసరమైన గెస్ట్ పాత్రలు చేయకుండా పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉంటేనే చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X