India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసత్య ప్రచారం ఆపండి..భర్త మరణంపై నటి మీనా ఎమోషనల్ లెటర్!

  |

  ఒకప్పటి హీరోయిన్, నటి మీనా భర్త ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి సంబంధించిన అనేక రకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో మీనా దుఃఖ సమయంలో కూడా సోషల్ మీడియాలో స్పందించాల్సి వచ్చింది. ఆమె ఏమన్నారు? ఎమోషనల్ అవుతూ రాసిన లేఖలో ఏం పేర్కొన్నారు అనే విషయం పరిశీలిస్తే...

   అందరికీ కృతజ్ఞతలు

  అందరికీ కృతజ్ఞతలు

  తాను ఎంతగానో ప్రేమించే తన భర్త దూరమైనందుకు చాలా దుఃఖంలో ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తాను మీడియాకు తమ ప్రైవసీ వదిలివేయాలని పరిస్థితి అర్థం చేసుకుని తమను కాస్త స్థిమితంగా ఉండనివ్వాలని అభ్యర్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం మీద తప్పుడు సమాచారం ప్రసారం చేస్తుంటే కనుక వెంటనే దాన్ని నిలిపివేయాలని ఆమె కోరారు. ఇక ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నాకు నా కుటుంబానికి అండగా నిలబడిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

  అందరికీ కృతజ్ఞతలు

  అందరికీ కృతజ్ఞతలు


  తన భర్తకు చికిత్స అందించిన మెడికల్ టీంకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని వారు తమ శాయశక్తుల తన భర్తను బతికించాలని కృషి చేశారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్, హెల్త్ మినిస్టర్, ఐఏఎస్ రాధాకృష్ణన్ అలాగే నా సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీడియా అలాగే తనను ఎంతగానో ప్రేమిస్తున్న తన అభిమానులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని ప్రార్ధనలు చేస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు.

  అవకాశం లేకపోవడంతో

  అవకాశం లేకపోవడంతో


  నిజానికి మీనా భర్త కరోనా తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల మరణించారంటూ ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత పావురాల వ్యర్ధాల కారణంగా ఆయన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురవడంతో వాటిని పూర్తిగా మార్చాల్సి వచ్చిందని కథనాలు బయటకు వచ్చాయి. వాటిని మార్చేందుకు ఎక్కడా అవకాశం లేకపోవడంతోనే ఆయన అనారోగ్య పరిస్థితి విషమించి ఆయన మరణించినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి.

   అవకాశం లేకపోవడంతో

  అవకాశం లేకపోవడంతో


  అయితే ఈ విషయం మీద స్పందించిన కళ మాస్టర్ విద్యాసాగర్ మరణానికి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షనే కారణమని వెల్లడించారు కరోనా రావడానికి అంటే ముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ సోకిందని, కానీ ఆ విషయాన్ని గుర్తించే సమయానికి బాగా ఆలస్యం అయిపోయిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు ఆయన ఊపిరితిత్తులు మార్చాలని సూచించారని ఏప్రిల్ నెలలో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఊపిరితిత్తుల మార్చేందుకు శతవిధాల ప్రయత్నించామని అన్నారు,

   చర్చనీయాంశంగా

  చర్చనీయాంశంగా


  ముఖ్యమంత్రి సహా మంత్రుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తే వారు కూడా ప్రయత్నాలు చేశారని కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలు ఫలించే లోపు మీనా భర్త విద్యాసాగర్ మనకు దూరమయ్యారని ఆమె వెల్లడించారు. మొత్తం మీద మీనా భర్త మరణానికి సంబంధించిన వార్త అటు తమిళ మీడియా వర్గాలలో తెలుగు మీడియా వర్గాలలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు సినీ వర్గాల నుంచి ఎవరూ మీనా భర్త అంత్యక్రియలకు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మీద తెలుగు మీడియా కూడా మౌనం పాటిస్తోంది.

  English summary
  Actress Meena Wrote an emotional letter on her husband's demise and pleased media not to circulate false information
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X