twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ రాకెట్‌పై మెహ్రీన్ క్లారిటీ.. యూఎస్ అధికారులు విచారించారు కానీ !

    By Rajababu
    |

    Recommended Video

    యూఎస్ సెక్స్ రాకెట్ పై స్పందించిన మెహ్రీన్

    అమెరికాలో సెక్స్ రాకెట్ కుంభకోణం బయట ప్రపంచానికి పొక్కడం, ఆ వ్యవహారంలో నిర్మాత మొదుగుముడి కిషన్, ఆయన సతీమణి చంద్రకళ అరెస్ట్ కావడంతో టాలీవుడ్ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ కుంభకోణంలో చాలా మంది సినీ తారల పేర్లు మీడియాలో కథనాల్లో వెలుగు చూశాయి. ఈ క్రమంలో యువ అందాల తార మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పేరు కూడా మీడియాలో ప్రచారమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల స్పందించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పలు విషయాలపై ట్విట్టర్‌లో స్వయంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

    నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు

    నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు

    పంతం సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెహ్రీన్ మాట్లాడుతూ. యూఎస్ సెక్స్ రాకెట్‌లోకి మీడియా నా పేరు లాగింది. కొన్ని మీడియా సంస్థలు నా గురించి ఏవేవో కథనాలు వెల్లడించాయి. మీడియా కథనాలతో నేను, నా కుటుంబం బాధపడాల్సి వచ్చింది అని అన్నారు. నేను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

    మీడియా కథనాల్లో వాస్తవం లేదు

    మీడియా కథనాల్లో వాస్తవం లేదు

    ఇటీవల వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం లేదు. నేను ఎలాంటి ఇంటర్వ్యూ ఎవరకీ ఇవ్వలేదు. నాకు మీడియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు కూడా నాకు మంచి గౌరవాన్ని ఇస్తారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ముంబైలో ఉండటం వల్ల పంతం ప్రమోషన్‌లో పాల్గొనలేకపోయాను అని మెహ్రీన్ ప్రకటనలో వెల్లడించింది.

    ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారించారు.

    ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారించారు.

    సెక్స్ రాకెట్ వివాదం నేపథ్యంలో అమెరికాలో ఓ జరిగిన సంఘటన గురించి చెప్పాలనుకొంటున్నాను. విహార యాత్రలో భాగంగా నేను నా ఫ్యామిలీతో కలిసి వాంకోవర్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్నాను. నన్ను సినీ తారగా గుర్తించి ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారించారు. అమెరికాలో ఎందుకు పర్యటిస్తున్నావని అడిగి తెలుసుకొన్నారు. అప్పుడే అధికారులు సెక్స్ రాకెట్ గురించి నాకు చెప్పారు అని తెలిపారు.

     సెక్స్ రాకెట్ వ్యవహారంలో

    సెక్స్ రాకెట్ వ్యవహారంలో

    ఇక సెక్స్ రాకెట్ నేపథ్యంలో నన్ను విచారించలేదు. ఆ తర్వాత నాకు అధికారులు క్షమాపణ చెప్పారు. మిగితా ప్రయాణంలో ఇబ్బందులు కలుగవని చెప్పారు. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు అని మెహ్రీన్ చెప్పారు.

    అందుకే క్లారిటీ ఇస్తున్నాను..

    అందుకే క్లారిటీ ఇస్తున్నాను..

    సెక్స్ రాకెట్‌కు ముడిపెడుతూ ఏవేవో కథనాలు వస్తున్న నేపథ్యంలో నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు విషయం చెప్పితే ఈ వ్యవహారం ముగిసిపోతుందని అనుకొన్నాను. అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను అని ట్విట్టర్‌లో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    నా ఇమేజ్‌కు భంగం కలిగించేలా

    నా ఇమేజ్‌కు భంగం కలిగించేలా

    నన్ను లక్ష్యంగా చేసుకొని కొందరు నా ఇమేజ్‌కు భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తున్నది. ఈ కుంభకోణంలో ఉన్న వారికి తగిన శిక్ష పడిందని భావిస్తున్నాను అని మహ్రీన్ అభిప్రాయపడ్డారు.

    తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా

    తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా

    ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచేందుకు నా పనిపై దృష్టిపెడుతాను. కష్టపడి పనిచేస్తాను. ఎప్పడు ఉత్తమ ప్రతిభను చాటడానికి ప్రయత్నిస్తాను. తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. దాని ప్రతిష్ఠను దిగజార్చవద్దు అని మెహ్రీన్ కోరారు.

    వివాదంపై ఇక స్పందించను

    యూఎస్ సెక్స్ రాకెట్ గురించి ఇక ముందు స్పందించను. ఇక ఇదే చివరిసారి. నా గురించి చెడుగా రాయవద్దని మీడియాను కోరుతున్నాను. ఏదైనా రాయాల్సి వస్తే నన్ను సంప్రదించి లేదా వివరణ తీసుకొని రాయమని వేడుకొంటున్నాను అని మెహ్రీన్ సూచించారు.

    English summary
    A Telugu businessman-turned-film producer and his wife were arrested in Chicago on charges of running a sex racket by exploiting upcoming actresses. According to reports, the couple ran a high-end prostitution ring by luring actresses from Tollywood to the US and advertising them for sex at Indian conferences and cultural events. In this juncture, actress Mehreen Pirzada reacted on Social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X