మతం మార్చుకుంది: హీరోయిన్ వివాహం (ఫోటోలు)
హైదరాబాద్: నటి మోనిక పెళ్లి ఆదివారం (జనవరి 11) చెన్నైలో ఘనంగా జరిగింది. బాల తారగా చంటి, స్వాతి చిత్రాల్లో బాలనటిగా చేసిన మోనిక, నా అల్లుడు వెరీ గుడ్ చిత్రంలో హీరోయిన్‌గా చేశారు. దీంతో పాటు చిత్రాల్లో చెల్లెలు, కూతురు లాంటి పలు రకాల పాత్రలను తెలుగు, తమిళం భాషల్లో పోషించారు.
ఇటీవలే ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఈమె తన పేరును రహీనాగా మార్చుకున్నారు. మధురై కు చెందిన వ్యాపారవేత్త మాలిక్ తో మోనికకు నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వీరి పెళ్లి ఈ నెల 11న చెన్నై నందంబాక్కం లో ఇస్లాం సంప్రదాయం ప్రకారం జరగింది. వరుడు... మౌనిక తండ్రికి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అందంగా...
పెళ్లి వేడుక సందర్బంగా అందంగా తయారైన మౌనిక. పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

సాంప్రదాయం ప్రకారం
ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.స

సినిమాలకు దూరం
పెళ్లి తర్వాత మౌనిక ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు సమాచారం.

భర్తతో కలిసి..
భర్తతో కలిసి వివాహ వేడుకలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రహీనా.

వ్యాపార వేత్త
మధురై కు చెందిన వ్యాపారవేత్తను మౌనిక పెళ్లాడింది. వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.


Click it and Unblock the Notifications











