సినీ తార, ఎంపీ నుస్రత్ జహాన్ ‘ఫ్యాన్సీ షాక్...’ వేల రూపాయల కుచ్చుటోపి!
సినీ తార, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ భర్త నిఖిల్ జైన్ మోసానికి గురయ్యారు. వేల రూపాయలు మోసాని గురయ్యామని తెలుసుకొన్న నుస్రత్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి పెళ్లి విందు రోజే ఈ చీటింగ్ వ్యవహారం బయటపడటం గమనార్హం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నుస్రత్ జహాన్ భారీ మెజారిటీ గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఎంపీ కాగానే తన ప్రియుడు, పారిశ్రామిక వేత్తతో వివాహం జరిగింది. నుస్రత్ దంపతులకు జరిగిన మోసం ఏమిటంటే..

నుస్రత్ దంపతులకు చీటింగ్ ఇలా
ఎంపీ నుస్రత్ జహాన్ భర్త నిఖిల్ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నారు. రంగోలి చీరెల కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా వీఐపీ మొబైల్ నంబర్ కోసం రూ.45 వేలు చెల్లించారు. అయితే వారు అడ్రస్ లేకుండా పోవడంతో మోసానికి గురయ్యామని తెలుసుకొన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన నుస్రత్ దంపతులు కోల్‌కతా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుజరాత్ బ్యాంక్ ఎకౌంట్‌కు డబ్బు
నుస్రత్ దంపతులు ఫిర్యాదులో.. టెలికాం కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఈ-మెయిల్ ఐడీతోపాటు, బల్క్ మెసేజ్‌తో నాకు మే 26న ఓ మెసేజ్ వచ్చింది. ఫ్యాన్సీ నంబర్లు ఇస్తామని, అందుకు రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గుజరాత్‌లోని సుభన్‌పురా బ్రాంచీతో కూడిన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఇచ్చాను. కానీ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు అని తెలిపారు.

పలువురికి ఇలానే కుచ్చుటోపి
నుస్రత్ జహాన్ దంపతుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు రంగంలోకి దిగారు. అయితే వారి ఇన్వెస్టిగేషన్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది కోల్‌కత్తా వాసులకు, ప్రముఖులు ఇలాంటి మోసానికి గురైనట్టు సమాచారం. వీఐపీ నంబర్లు, ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు ఇస్తామని, వినియోగదారులకు మొబైల్ సందేశాలు పంపి పలువురిని మోసగించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.

క్రిమినల్, చీటింగ్ కేసు నమోదు
నుస్రత్ జహాన్ భర్త నిఖిల్ జైన్ ఫిర్యాదు మేరకు చీటింగ్‌కు పాల్పడిన వారిపై ఐటీ యాక్ట్ 66సీ, 66డీ ప్రకారం కేసు నమోదు చేశాం. నేరపూరిత కుట్ర, చీటింగ్ తదితర అంశాలపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. చీటర్లను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే వారిని పట్టుకొంటాం అని కోల్ కతా పోలీసులు వెల్లడించారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.


Click it and Unblock the Notifications











