మృణాల్ మార్షల్ ఆర్ట్స్.. ఎవరైనా సరే బొక్కలు చూరచూర అవ్వాల్సిందే.. ఇదంతా దానికోసమేనా?
'సీతారామం'లో సీతగా నటించి ఆడియెన్స్ మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది మృణాల్ ఠాకూర్.
ఎంతో క్యూట్ గా ఉండే ఈ సుకుమారమైన భామ.. ఆ తర్వాత సోషల్ మీడియాలో తనలోని అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడిలో మరో కోణం కూడా ఉంది. ఆమెను ఎవరైనా టచ్ చేస్తే.. వారి బొక్కలు చూరచూర చేస్తాననే రేంజ్ లో సమాధానం ఇస్తోంది. వివరాళ్లోకి వెళితే...
మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పునక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు.. ఒక్క 'సీతారామం'తో తెచ్చుకుంది. దీంతో ఈ భామ.. సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. నార్త్ టు సౌత్ తేడా లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోలంతా ఆమెతో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు.

పంచ్ లతో ప్రత్యర్థులపైకి: అయితే ఇప్పుడీ ముదుగుమ్మ తన పంచ్ లతో ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సన్నద్ధమవుతుందా? అని అనిపిస్తోంది. కఠినమైన మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ నెట్టింట్లో దర్శనమిచ్చింది. తనతో పెట్టుకుంటే బొక్కలు చూర చూర చేసేందుకు రెడీ అవుతుందా? అనేలా కనిపిస్తుంది.
అవును మీరు చదువుతోంది నిజమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన సుకుమారమైన చేతులతో, ఆకట్టుకునే అందంతో ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ కనిపించింది.

తుఫాన్ సినిమా సమయంలో: ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే విషయం వెనక ఓ పెద్ద మ్యాటరే ఉంది. మృణాల్.. గతంలో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి 'తూఫాన్' అనే చిత్రంలో నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించారు. మృణాల్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. అదే సమయంలో దీనికి సంబంధించి ప్రాక్టీస్ కూడా చేసింది.
ఆ సమయంలో మృణాల్‌కు మార్షల్ ఆర్ట్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆ తర్వాత ట్రైనింగ్ ను అలానే కొనసాగిస్తోందట. ప్రొఫేషనల్ కిక్ బాక్సింగ్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ రోహిత్ నాయర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుందట.

అందుకే ట్రైనింగ్: తాజాగా ఈ విషయంపై మృణాల్ స్పందించింది. ఈ మిక్స్ డ్ మార్షల్ ట్రైనింగ్.. తాను ఇటీవలే నటించిన 'సెల్ఫీ' చిత్రం కోసం ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. వర్కౌట్ లో భాగమైందని చెప్పుకొచ్చింది. రోహిత్ నాయర్ దగ్గర శిక్షణ తీసుకోవాలంటే ఎంతో కృషి, అంకిత భావం ఉండాలని చెప్పింది. పూర్తి శ్రద్ధ పెడితేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొంది.

ఇక ఈ పిక్ చూసిన అభిమానులు: 'కొత్త సినిమా కోసం ఏమైనా ఇలా ట్రైనింగ్ తీసుకుంటుందా?' అని అనుకుంటున్నారు. 'మృణాల్ తో ఎవరైనా పెట్టుకుంటే బొక్కలు చూరచూర అవ్వాల్సిందే' అని మరికొందరు అంటున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నానితో 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండ - పరశురామ్ సినిమా చేస్తోంది. హిందీలో రెండు మూడు ప్రాజెక్ట్ లు చేస్తోంది. అలానే సోషల్ మీడియాలనూ అందాలను ఆరబోస్తోంది.


Click it and Unblock the Notifications











