Nagma: ఘోరంగా మోసపోయిన హీరోయిన్ నగ్మా.. ఆ ఒక్క పనిచేయడంతో అంత డబ్బు గోవిందా!

అలనాటి బ్యూటిఫుల్ హీరోయిన్ నగ్మా అప్పట్లో ఒక ఊపు ఊపేశారు. 90వ దశకంలో గ్లామర్ క్వీన్ గా యూత్ ను అట్రాక్ట్ చేసిన ఆమె దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఘరానా మొగుడు, నాగార్జునతో అల్లరి అల్లుడు, రజనీకాంత్ భాషా సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సాంపాదించుకున్నారు. అనేక సినిమాల్లో హాట్ గా నటించిన నగ్మా పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉండేది. ఇదిలా ఉంటే ఇటీవల నగ్మా ఘోరంగా మోసపోయి డబ్బు పోగోట్టుకోవాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోలతో..

స్టార్ హీరోలతో..

1990వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు నగ్మా. టాలీవుడ్ తోపాటు తమిళం, హిందీ, భోజ్ పురి చిత్ర పరిశ్రమల్లో తనదైన గుర్తింపు పొందారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, ఫ్యామిలీ హీరో వెంకటేష్ వంటి అగ్ర కథానాయకులతో నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ చేశారు.

 నిజ జీవితంలోనూ..

నిజ జీవితంలోనూ..

బ్యూటిఫుల్ నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మోరార్జీ. 1974లో ముస్లిం-హిందూ కుటుంబంలో జన్మించారు నగ్మా. తండ్రి జైసల్మేర్ రాజకుంటుబానికి చెందినవారు కాగా పలు కారణాలతో గుజరాత్, ముంబైకి షిప్ట్ అయ్యారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నగ్మా తమిళం, హిందీతోపాటు భోజ్ పురి చిత్రసీమలో కూడా అనేక చిత్రాల్లో నటించి పాపులారిటీ దక్కించుకున్నారు. సినిమాలో అగ్ర హీరోలతో రొమాన్స్ చేసిన నగ్మా రియల్ లైఫ్ లోను స్టార్ హీరోలతో లవ్ ట్రాక్ నడిపినట్లు అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి.

 నగ్మా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో

నగ్మా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో

ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తిరుపతిలో ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత గంగూలీ భార్య డోనా కలుగజేసుకోవడంతో వీరిద్దరి రిలేషన్ కు ముగింపు పడినట్లు టాక్ వినిపించింది. అయితే అప్పట్లో గంగూలీ క్రికెట్ సరిగా ఆడనప్పుడు అతని ఫ్యాన్స్ నగ్మాను టార్గెట్ చేసేవారని సమాచారం.
సౌరవ్ గంగూలీ తర్వాత రాధిక భర్త అయిన శరత్ కుమార్ తో, తర్వాత భోజ్ పురి నటుడు రవికిషన్ తో అఫైర్ నడిపిందని వార్తలు గుప్పుమన్నాయి.

సైబర్ నేరాలు..

సైబర్ నేరాలు..

ఇలా పలు రూమర్స్ తో వివాదాస్పదమైన ముద్దుగుమ్మ నగ్మా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే రాణించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ప్రవేశించిన నగ్మా ఉత్తరప్రదేశ్ లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల పెరుగుతున్న టెక్నాలజీతోపాటు రోజురోజుకీ సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. మొదట్లో పెద్దగా చదువుకోనివాళ్లను బురిడీ కొట్టించిన ఈ కేటుగాళ్లు సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తున్నారు.

 బ్యాంక్ ఉద్యోగి అంటూ..

బ్యాంక్ ఉద్యోగి అంటూ..

తాజాగా నటి, రాజకీయనాయకురాలు నగ్మా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. బ్యాంక్ అధికారులమంటూ ఆమెను మోసం చేశారు. సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కిన నగ్మా డబ్బు పోగోట్టుకున్నారు. ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్ కి బ్యాంక్ బ్యాంక్ అధికారులు పంపినట్లుగా ఒక మెసేజ్ వచ్చింది. ఆ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఒక వ్యక్తి కాల్ చేశాడట. తాను బ్యాంక్ ఉద్యోగినంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి కేవైసీ అప్డేట్ చేయాల్సిందిగా కోరాడట.

అతడికి చెప్పలేదని..

అతడికి చెప్పలేదని..

అప్పుడు నగ్మా బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పనప్పటికీ ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి బెనిఫిషరీ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని వెంటనే రూ. 1 లక్షను ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడని సమాచారం. ఆ సమయంలో నగ్మా ఫోన్ కు సుమారు 20 సార్లు ఓటీపీ వచ్చిందని.. ఆ ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అతడికి చెప్పలేదని నగ్మా తెలిపారు. అయినా కూడా తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. లక్ష ట్రాన్స్ ఫర్ చేసుకోగలిగాడని ఆమె చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X