For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమిత పెళ్ళి డేట్ చెప్పేసింది:పెళ్ళికొడుకు శరత్ బాబు కాదు, ఎవరంటే...

    |
    Actress Namitha Announced Her Marrige Date పెళ్ళి డేట్ చెప్పేసింది

    తమిళ నటుడు వీరా (వీరేంద్ర చౌదరీ) తో ఈనెల 24న తన వివాహం జరగనుందని నమిత స్వయంగా చెప్పింది. తమిళ బిగ్ బాస్ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్ మరికొందరు కలిసి సోషల్ మీడియాలో ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ వీడియో మెసేజ్ ద్వారా అభిమానులందరికీ నమిత పెళ్లి సంగతి తెలియజేశారు.

     బాయ్ ఫ్రెండ్

    బాయ్ ఫ్రెండ్

    అదే వీడియోలో తన బాయ్ ఫ్రెండ్.. ఉడ్ బీతో కలిసి కనిపించిన నమిత తన సొట్టబుగ్గల నవ్వులతో ఆనందంగా మాట్లాడింది. నవంబర్ 24న వీరాతో తన పెళ్లి జరగనుందని.. మీ అందరి ప్రేమాభిమానాలు తనకెప్పుడూ ఉండాలని కోరుకుంది. నమిత పెళ్లి చేసుకోబోతున్న వీరా తమిళంలో చిన్నాచితకా పాత్రలు చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు.

    తెలుగు తెరపైనే

    తెలుగు తెరపైనే

    నమిత పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది తెలుగు తెరపైనే అయినా ఇక్కడ ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. భారీ అందాలకు పెద్దపీట వేసే కోలీవుడ్ వెల్ కం చెప్పడంతో పెట్టెబేడా సర్దుకుని చెన్నైకి షిఫ్టయిపోయింది. చివరకు తమిళనాడులోనే తన లైఫ్ పార్టనర్ ను వెతుక్కుని అక్కడే సెటిలయిపోతోంది.

    నమితకు తమిళంలో

    నమితకు తమిళంలో

    ఒకప్పుడు నమితకు తమిళంలో స్టార్ హీరోస్ కి ఉన్న క్రేజ్ ఉండేది. ఈమె సినిమాల కోసం అభిమానులు థియేటర్ల దగ్గర బారులు కట్టేవారు. కొంద‌రు త‌న అభిమానం చాటుకోవ‌డానికి గుళ్ళు కూడా క‌ట్టారు. తెలుగులోను సత్తా చాటిన నమిత చివరిగా 2010లో విడుదలైన సింహలో నటించింది.

     గుంటూర్ టాకీస్-2

    గుంటూర్ టాకీస్-2

    ఆ తర్వాత నమిత మరే తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. అయితే గుంటూర్ టాకీస్-2 పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా ఈ సినిమాకు రాజ్ కుమార్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని , అందులో న‌మిత ఓ ప్రధాన పాత్రలో మెరవనుందని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు న‌మిత పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.

    శ‌ర‌త్ బాబు, న‌మిత ఖండించారు

    శ‌ర‌త్ బాబు, న‌మిత ఖండించారు

    ఈ భామ సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబుని వివాహం చేసుకోనుంద‌ని ప‌లు వార్త‌లు రాగా, వీటిని శ‌ర‌త్ బాబు, న‌మిత ఖండించారు. కాని ఇప్పుడు నమిత.. త‌న వివాహం వీరాతో ఈ నెల 24న జ‌ర‌గ‌నుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. తమిళ బిగ్ బాస్ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్ మరికొందరు కలిసి సోషల్ మీడియాలో ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ ఓ వీడియో ద్వారా న‌మిత పెళ్ళి విష‌యాన్ని తెలిపారు.

    త‌న అఫీషియ‌ల్ పేజ్‌లో

    ఇక వీరా కూడా త‌న అఫీషియ‌ల్ పేజ్‌లో న‌మిత‌ని వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలిపాడు. వీరా, న‌మిత క‌లిసి మియా అనే థ్రిల్ల‌ర్ ఫిలింలో క‌లిసి న‌టించారు. క్రింద కనిపిస్తున్న వీడియోలో న‌మిత ప్ర‌క్క‌న నించున్న వ్య‌క్తే వీరా. మొత్తానికి ఇన్నాళ్ళకి చాలా రూమర్లకి తెర దించేస్తూ తమిళ అమ్మాయిగా సెట్ అయిపోతోందన్నమాట ఈ గుజరాతీ భామ.

    English summary
    Namitha has a good news for her fans. The actress has announced to marry Veerandra Chowdhary and also revealed the wedding date. The big news was revealed on her Instagram account through a video where Riaz Wilson, model and Bigg Boss Tamil contestant, announced that they are happy to announce the date of the big day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X