అమ్మాయిలు జీరో సైజులో కన్పడితే బాగుండరు. బాడీలో ఎక్కడ వంపులు, ఎంతమేరకు ఉండాలో ఆ విధంగా కన్పిస్తేనే అందం. మీరు మగాళ్ళను అడిగిచూడండి. వాళ్ళు ఎలాంటి అమ్మాయిలను కోరుకుంటున్నారో..నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది మగాళ్ళు ఒంపు సోంపులున్న అమ్మాయిల్నే కోరుకుంటారు. అంతే తప్ప జీరో సైజు అమ్మాయిలను ఎవరూ కోరుకోరు. అలాగే నాకు కూడా జీరో సైజు అంటేనే ఇష్టం. అంటోంది నీతూ చంద్ర. సత్యమేవ జయితే చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆమె తాజాగా ధర్టీన్ బి అనే బాలీవుడ్ ధ్రిల్లర్ లో కూడా నటించింది. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ గా మారిన జీరో సైజు గురించి ఆమె పై విధంగా స్పందించారు. నీతూ చంద్ర మొదట తెలుగులో గోదావరి చిత్రంలో కన్పించారన్న సంగతి తెలిసిందే.