twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం చేసినా 30 ఏళ్ల లోపే, ఆ తర్వాత పెళ్లి, ఏ హీరోతో చేయాలని లేదు: సైరాలో తన పాత్రపై నిహారిక

    |

    నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ' సూర్యకాంతం' చిత్రం మార్చి 29 న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడ్డ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

    ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు 'సూర్యకాంతం' సినిమా గురించి ప్రశ్నలతో పాటు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా'లో ఆమె చేస్తున్న పాత్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.

    చరణ్ అన్నయ్యను రిక్వెస్ట్ చేశా

    చరణ్ అన్నయ్యను రిక్వెస్ట్ చేశా

    చిరంజీవి డాడీ 150వ సినిమా నుంచే ఆయనతో ఒక్క ఫ్రేములో అయినా కనిపించాలనే కోరిక ఉండేది. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. ‘రంగస్థలం' సినిమా సమయంలో చరణ్ అన్న దగ్గరకు వెళ్లి ‘సైరా'లో ఒక చిన్న పాత్ర అయినా చేసే అవకాశం కల్పించాలని కోరారు. డైలాగ్ లేకున్నా పర్వాలేదు... డాడీ వెనకాల నడిచే సీన్లో అయినా చేయడానికి సిద్ధమే అని... రిక్వెస్ట్ చేసినట్లు నిహారిక తెలిపారు.

    సైరాలో తన పాత్ర గురించి..

    సైరాలో తన పాత్ర గురించి..

    నేను రిక్వెస్ట్ చేయగానే చరణ్ అన్న... ‘‘నేను ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేను. డైరెక్టర్ సురేందర్ రెడ్డిగారిని అడగమని చెప్పారు''. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆయన రంగస్థలం షూటింగుకు వచ్చారు. సార్ నేను చేస్తానని అడగ్గానే.. వెంటనే ఒప్పుకున్నారు. నాది చిన్న పాత్రే అయినా బావుంటుంది. చిరంజీవిగారి దగ్గర రెండు సార్లు కనిపిస్తానని... నిహారిక తెలిపారు.

    పెద్ద హీరో సినిమాలైనా ప్లాపే...

    పెద్ద హీరో సినిమాలైనా ప్లాపే...

    మా ఫ్యామిలీలో కాకుండా ఇతర హీరోల్లో ఎవరితో పని చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న నన్ను చాలా మంది అడుగుతున్నారు. అలా అడిగే వారందరికీ నేను చెప్పేది ఒకటే. సినిమాలో హీరో హీరోయిన్ కంటే స్క్రిప్టు ముఖ్యమని నేను నమ్ముతాను. స్క్రిప్టు బాలేకుంటే పెద్ద హీరో చేసిన సినిమాలు కూడా డిజాస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే నేను స్క్రిప్టు గురించే ఆలోచిస్తానే తప్ప హీరోలతో చేయడం గురించి ఆలోచించను... అని నిహారిక స్పష్టం చేశారు.

    నాకు 30 ఏళ్ల వరకే ఛాన్స్, ఆ తర్వాత పెళ్లి...

    నాకు 30 ఏళ్ల వరకే ఛాన్స్, ఆ తర్వాత పెళ్లి...

    ఒక అమ్మాయికి కనీసం 30 ఏళ్ల ముందే పెళ్లి అవ్వాలని ఆలోచించే ఆర్థో‌డాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా వాళ్లు నాకు 30 ఏళ్ల వరకే నటించే అవకాశం ఇచ్చారు. ఈ తక్కువ సమయంలో నేను మంచి స్క్రిప్టులు చేయాలని చూస్తున్నానే తప్ప... యాక్టర్లతో చేయాలని ఎదురు చూడటం లేదు. స్క్రిప్టు బావుంది, అది నాకు సూటవుతుంది అనిపిస్తే ఎవరితో అయినా చేస్తాను. నాకు ఉన్న ఒకే ఒక కోరిక చిరంజీవి గారితో చేయాలని, ‘సైరా'తో ఆ కోరిక తీరిందని నిహారిక తెలిపారు.

    English summary
    Actress Niharika About Her Role In Sye Raa Narasimha Reddy Movie. Sye Raa Narasimha Reddy is an upcoming Indian Telugu-language historical war film directed by Surender Reddy and produced by Ram Charan on Konidela Production Company banner. The story is based on the life of freedom fighter Uyyalawada Narasimha Reddy from Rayalaseema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X