అక్రమ సంభంధంతో నిఖితపై మూడేళ్ళ బ్యాన్

By Srikanya

కన్నడ నటుడు దర్శన్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి నిఖితపై కన్నడ చలన చిత్ర నిర్మాతల సంఘం మూడేళ్ళ పాటు నిషేధం విధించింది. విజయలక్ష్మి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తమ కుటుంబంలో గొడవలకు నటి నిఖితే కారణమని ఆరోపించిన నేపథ్యంలో నిర్మాతల సంఘం ఆదివారం సమావేశమై నిఖితపై మూడేళ్ల పాటు నిషేధం వేటు వేసింది.నాలుగు రోజుల క్రితం దర్శన్ మద్యం మత్తులో తన భార్య విజయలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆవేశంలో విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయనగర్ పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. భవిష్యత్తులో ఏ నటి కూడా నటులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకుని వారి సంసారాల్లో చిచ్చు పెట్టకుండా ఉండాలన్న సదుద్దేశంతోనే ఈ కఠిన తీర్మానం తీసుకున్నట్లు నిర్మాతల సంఘం అధ్యక్షుడు మునిరత్నం విలేకరులకు తెలిపారు. దర్శన్ జైలు నుంచి విడుదలైన తరువాత అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

దర్శన్ కుటుంబంలో గొడవకు తాను కారణం కాదన్నారు. అవివాహితగా ఉన్న తనపై నిర్మాతల సంఘం అపనిందను మోపి నిషేధం విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దర్శన్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉంటే చూపాలని నిర్మాతల సంఘాన్ని ప్రశ్నిస్తానన్నారు. అలాగే విజయలక్ష్మిని కలిసి తనపై ఆరోపణలకు ఆధారాలు చూపాలని నిలదీస్తానన్నారు. ఇదిలా ఉండగా భర్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని విజయలక్ష్మి తీర్మానించుకున్నందున సోమవారం దర్శన్ విడుదలయ్యే అవకాశముంది. కాగా ముంబైలో ఉన్న నిఖిత.. నిర్మాతల సంఘం తీర్మానంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శన్‌తో నటించడం వల్ల ఆయనతో పరిచయం ఏర్పడిందే తప్పతమ మధ్య ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. సంబరం,కళ్యాణ రాముడు, మహా రాజశ్రీ వంటి చిత్రాల్లో నటించిన నిఖిత తనకు ఆ హీరోతో ఎఫైర్ లేదని మీడియా వద్ద వాపోయింది. అలాగే తనకు ఆ మొగడు,పెళ్ళాలు ఎందుకు కొట్టుకున్నారో,విడిపోయారో తెలియదు అంది.అలాగే తనకూ దర్శన్ కీ మధ్య రిలేషన్ కేవలం ...షూటింగ్ వరకే పరిమితం అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X