మానసిక వ్యధతో ఆస్పత్రిపాలైన నిఖిత
కన్నడ నటుడు దర్శన్ వివాదంలో కీలకంగా భావిస్తున్న నటి నిఖిత ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. దర్శన్ కుటుంబంలో తగాదాలు రావడానికి నటి నిఖిత అన్న అనుమానంతో ఆమెపై కన్నడ చిత్రపరిశ్రమ మూడేళ్లపాటు నిషేధం విధించింది. అయితే ఆమె తండ్రి కొద్ది నెలల క్రితమే మరణించడం, దానికి తోడు ఈ వివాదంలో ఇరుక్కోవడంతో నిఖిత మానసికంగా ఒత్తిడికి లోను కావడంతో ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్చారని కధనాలు వస్తున్నాయి.కాగా భార్యతో ఘర్షణపడిన నటుడు దర్శన్ జైలుపాలైన సంగతి తెలిసిందే.ఇక కన్నడ నటుడు దర్శన్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి నిఖితపై కన్నడ చలన చిత్ర నిర్మాతల సంఘం మూడేళ్ళ పాటు నిషేధం విధించింది.
విజయలక్ష్మి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తమ కుటుంబంలో గొడవలకు నటి నిఖితే కారణమని ఆరోపించిన నేపథ్యంలో నిర్మాతల సంఘం ఆదివారం సమావేశమై నిఖితపై మూడేళ్ల పాటు నిషేధం వేటు వేసింది.నాలుగు రోజుల క్రితం దర్శన్ మద్యం మత్తులో తన భార్య విజయలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆవేశంలో విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయనగర్ పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. భవిష్యత్తులో ఏ నటి కూడా నటులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకుని వారి సంసారాల్లో చిచ్చు పెట్టకుండా ఉండాలన్న సదుద్దేశంతోనే ఈ కఠిన తీర్మానం తీసుకున్నట్లు నిర్మాతల సంఘం అధ్యక్షుడు మునిరత్నం విలేకరులకు తెలిపారు. దర్శన్ జైలు నుంచి విడుదలైన తరువాత అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











