Nitya Menon Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యమీనన్.. బిడ్డకు తండ్రి ఎవరంటే?

నిత్యా మీన‌న్‌.. ఈ టాలెంటెడ్ హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఈ మలయాళ ముద్దుగుమ్మ తనదైన శైలి సహజసిద్ధమైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సౌతిండియాలోనే స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది. ఇలా ఇప్పటికీ భారీ ప్రాజెక్టులతో సత్తా చాటుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిత్యా మీనన్.. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలివే!

అలా పరిచయం.. సౌత్‌లో స్టార్‌గా

అలా పరిచయం.. సౌత్‌లో స్టార్‌గా

నిత్యా మీనన్ 'హనుమాన్' అనే ఇంగ్లీష్ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత '7 O' Clock' అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయమైంది. అనంతరం 'అలా మొదలైంది'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, తమిళంలోనూ హీరోయిన్‌గా నటించింది. ఇలా దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ స్టార్‌గా హవా చూపిస్తోంది.

కన్నడ సూపర్ స్టార్‌తో సహజీవనం

కన్నడ సూపర్ స్టార్‌తో సహజీవనం


కెరీర్ పరంగా వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న నిత్యా మీనన్.. పర్సనల్‌ లైఫ్‌లోనూ బాగానే ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో కొన్ని డేటింగ్ వార్తలతో బాగా హైలైట్ అయింది. అప్పట్లో ఈ అమ్మడు ఓ కన్నడ సూపర్ స్టార్ హీరోతో సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈమె కోసం ఆ హీరో భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత అలా జరగలేదు.

కోలీవుడ్‌లోని బడా హీరోతో డేటింగ్

కోలీవుడ్‌లోని బడా హీరోతో డేటింగ్

కన్నడ స్టార్ హీరోతో బ్రేకప్ తర్వాత నిత్యా మీనన్ కోలీవుడ్‌కు చెందిన మరో బడా హీరోతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడు కూడా తన భార్యను కాదని ఈమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత అతడితో కూడా నిత్యా దూరమైంది. అనంతరం ఈమె గురించి చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, వీటిపై ఏనాడూ స్పందించలేదు.

ఆ నటుడిని పెళ్లి చేసుకోబోతుంది

ఆ నటుడిని పెళ్లి చేసుకోబోతుంది

సౌతిండియన్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ పెళ్లి గురించి కొద్ది రోజుల క్రితం ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అందులో ఆమె పెళ్లికి రెడీ అయిపోయినట్లు టాక్ వినిపించింది. అంతేకాదు, నిత్యా మలయాళ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని కూడా ప్రచారం నడిచింది. కానీ, ఈ వార్తలను ఆమె సోషల్ మీడియా ద్వారా ఖండించింది.

ప్రెగ్నెంట్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్

ప్రెగ్నెంట్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యా మీనన్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిన కిట్‌కు సంబంధించిన ఫొటోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు, 'అద్భుతం మొదలైంది' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

తండ్రి ఎవరా అని నెటిజన్ల ఆరా

ప్రెగ్నెంట్ అయినట్లు నిర్ధారిస్తోన్న కిట్‌ ఫొటోను షేర్ చేసిన నిత్యా మీనన్ అందరికీ షాకిచ్చింది. దీంతో ఆమె గర్భవతి అయిందంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు, చాలా మంది నెటిజన్లు ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది తమకు తోచిన విధంగా దారుణమైన కామెంట్లను కూడా చేస్తూ రచ్చ లేపుతున్నారు.

కొత్త సినిమా కోసం ప్రమోషనేనా?

కొత్త సినిమా కోసం ప్రమోషనేనా?


నిత్యా మీనన్ షేర్ చేసిన ప్రెగ్నెన్సీ న్యూస్‌ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తన కొత్త సినిమా ప్రమోషన్ కోసమే ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే ప్రస్తావిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే, 'నిత్యా ప్రెగ్నెన్సీ న్యూస్‌'కు సంబంధించిన అసలు మేటర్ తెలియాలంటే మాత్రం వేచి చూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X