పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నివేదా: వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడి.. ఇంతకీ డిక్కీలో ఏముంది?

ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఆరంభంలోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో క్రేజీ బ్యూటీ నివేదా పేతురాజ్ ఒకరు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా తెలుగుతో పాటు దక్షిణాదిలోనూ ఎన్నో చిత్రాల్లో భాగం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నివేదా పేతురాజ్ పోలీసులకు దొరికిపోయినట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

అలా వచ్చి వరుస చిత్రాలు:2016లో వచ్చిన 'Oru Naal Koothu' అనే తమిళ చిత్రం ద్వారా నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత అదే భాషలో 'Podhuvaga En Manasu Thangam' అనే సినిమా చేసి ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2017లో వచ్చిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటరై మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

Actress Nivetha Pethuraj argued With Police Video Viral In Social Media

తెలుగులో అన్నీ సక్సెస్‌లే:తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని పాపులర్ అయిన నివేదా పేతురాజ్.. ఆ తర్వాత 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అల.. వైకుంఠపురములో', 'రెడ్' అనే సినిమాలు చేసింది. ఇవన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు కూడా వచ్చింది. కానీ, ఆఫర్లు మాత్రం ఆశించిన విధంగా రావట్లేదు.

దాస్‌తో హిట్.. ఇప్పుడదే:టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న నివేదా పేతురాజ్.. ఆ మధ్య విశ్వక్ సేన్‌తో 'పాగల్' అనే చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే గత ఏడాది 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రంతో మరోసారి అతడితో జతకట్టి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నివేదా 'భూ' అనే సినిమా చేసింది. ఇక, ఇప్పుడు ఈ అమ్మడు 'పార్టీ' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

Actress Nivetha Pethuraj argued With Police Video Viral In Social Media

కారు ఆపేసిన పోలీసులు:తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఎప్పటికప్పుడు మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న నివేదా పేతురాజ్‌కు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె కారులో ప్రయాణిస్తుండగా.. పోలీసులు ఆపారు. ఆ తర్వాత అందులో చెక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, దీనికి నివేదా పేతురాజ్ నిరాకరించినట్లు కనిపించింది.

డిక్కీ ఓపెన్ చేయమంటూ:తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో కారు ఆపిన పోలీసులు 'మేడం.. ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మేము మీ కారును చెక్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒకసారి డిక్కీని ఓపెన్ చేయండి' అని అడిగారు. కానీ, ఆమె మాత్రం కారుకు సంబంధించిన డాక్యూమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పింది. దీంతో పోలీసులు నివేదాపై సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.

పరువు అంటూ దాడి చేసి:కారు డిక్కీని చెక్ చేస్తామని పోలీసులు పదే పదే అనడంతో నివేదా పేతురాజ్ 'ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్థం కాదు' అంటూ దిక్కులు చూస్తూ కనిపించింది. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తిపై నివేదా దాడి చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక, ఇది చూసిన వాళ్లంతా ఏదో సినిమా ప్రమోషన్‌లో భాగం అయి ఉంటుందని అనుకుంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X