సినీ నటి, ఎంపీ నుస్రత్ జహాన్‌కు చేదు అనుభవం.. డేటింగ్ యాప్‌లో..
సినీ నటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన అనుమతి లేకుండా తన ఫోటోను వాడుకొని తన ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోటోను వీడియో చాటింగ్ అండ్ డేటింగ్ యాప్‌లో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నుస్రత్ జహాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నుస్రత్ జహాన్ ఫోటో వివాదం గురించి వివరాల్లోకి వెళితే..

డేటింగ్ యాప్‌లో నుస్రత్ జహాన్ ఫోటో
సినీ నటి, ఎంపీ నుస్రత్ జహాన్ ఫోటోను డేటింగ్ యాప్ కోసం వాడుతున్నారనే విషయాన్ని భస్వాతి నెటిజన్ గుర్తించి ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఎంపీ నుస్రత్ ఫోటోను వీడియో చాటింగ్ యాప్ కోసం వాడుతున్నారు. ఇది ఎలా సాధ్యం అంటూ ట్వీట్‌లో పేర్కొనడంతో ఈ వ్యవహారం నుస్రత్ జహాన్ దృష్టికి వచ్చింది.

నా అనుమతి లేకుండా డేటింగ్ యాప్ ఫోటో
ఆన్‌లైన్ డేటింగ్, వీడియో చాటింగ్ యాప్‌లో నా ఫోటోను పెట్టారు. నా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్‌కు నా ఫోటోను వాడుకొంటున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. యాప్‌లో వ్యాపార ప్రకటనలో వాడుకొన్న నా ఫోటో స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తున్నాను. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోం అంటూ నుస్రత్ జహాన్ ట్వీట్ చేశారు.

కోల్‌కతా పోలీసులకు నుస్రత్ జహాన్ ఫిర్యాదు
కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనుజ్ శర్మకు ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఓ సందేశాన్ని ఫిర్యాదుగా అందజేశారు. నా అనుమతి లేకుండా ఫోటోలను వాడటం పూర్తిగా అభ్యంతరకరం. నా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని సైబర్ సెల్ విచారణ చేపట్టాలని కోరుతున్నాను. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకొంటాను అని నుస్రత్ జహాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తగిన చర్యలకు ఆదేశం
నుస్రత్ జహాన్ చేసిన ట్వీట్‌కు కోల్‌కతా పోలీసులు స్పందించారు. ఈ డేటింగ్ యాప్‌పై తగిన చర్యలు తీసుకొంటామని ఎంపీ నుస్రత్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. త్వరలోనే డేటింగ్ యాప్‌పై చేసిన విచారణ వివరాలను అందజేస్తామని తెలిపినట్టు సమాచారం.
Recommended Video

నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితం గురించి
నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. సినీ నటిగా, మోడల్‌గా రాణిస్తున్న 30 ఏళ్ల యువ తార... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. బసీర్‌హాట్ నియోజకవర్గం నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను 2019లోనే టర్కీలో ప్రేమ వివాహం చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











