For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎంత మంది పొట్టకొడుతారు? టిక్‌టాక్ నిషేధంపై నుస్రత్ జహాన్ ఫైర్

  |

  టిక్ టాక్ యాప్‌ను నిషేధించడంపై బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయకుండా హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకొంటారని ప్రశ్నించారు. తాజాగా కోల్‌కతాలోని ఇస్కాన్ వేడుకలో పాల్గొన్న ఆమె కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నుస్రత్ జహాన్ మాట్లాడుతూ..

  టిక్ టాక్ నిషేధంపై నుస్రత్

  టిక్ టాక్ నిషేధంపై నుస్రత్

  టిక్ టాక్ అనేది వినోదాత్మకమైన యాప్. ప్రజలకు, నెటిజన్లకు ఆహ్లాదం, వారి ప్రతిభకు పదునుపెట్టే సాధనంగా మారింది. అలాంటి యాప్‌ను ఎలా నిషేధిస్తారు. ఇలాంటి యాప్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు సమగ్రమైన ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నిర్ణయాల వల్ల చాలా మంది నిరుద్యోగులుగా మారుతారనే విషయం తెలుసా అని నుస్రత్ జహాన్ ప్రశ్నించారు.

  యువత నిరుద్యోగం బారిన పడితే

  యువత నిరుద్యోగం బారిన పడితే

  టిక్ టాక్ నిషేధం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీలేదు. జాతీయ భద్రత కోసం నిషేధిస్తే మంచిదే. కానీ దానికంటూ ఓ ప్లాన్ ఉండాలి కదా? ఈ నిషేధం నోట్ల రద్దు లాంటిదే. యువతకు నిరుద్యోగం బారిన పడితే వారిని ఆదుకొనే ప్రణాళిక మీ వద్ద ఉందా? అలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? అని నుస్రత్ జహాన్ ప్రశ్నించారు.

  నా అభిమానులతో యాప్‌తో కనెక్ట్..

  నా అభిమానులతో యాప్‌తో కనెక్ట్..

  ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాం మాదిరిగానే టిక్ టాక్ సమాచార, వినోద ప్రచార సాధనం. నేను నా అభిమానులను, ప్రేక్షకులను ఈ యాప్‌ ద్వారా అనుసంధానమై ఉంటాను. ఒకవేళ జాతీయ ప్రయోజనాలు ఈ నిషేధం వెనుక ఉంటే సమర్ధిస్తాను. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంగా భావిస్తాను. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొవడానికే ఈ నిర్ణయం అని నుస్రత్ జహాన్ అన్నారు.

  మలైకా ఆరోరా స్పందిస్తూ..

  మలైకా ఆరోరా స్పందిస్తూ..

  టిక్ టాక్ యాప్‌ నిషేధంపై బాలీవుడ్ ప్రముఖుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. టిక్ టాక్ నిషేధంపై మలైకా ఆరోరా స్పందిస్తూ.. లాక్‌డౌన్‌లో నేను విన్న శుభవార్త ఇదే. చెత్త వీడియోలు ఇక యాప్‌ల్లో కనిపించవు. ఇది కొంచెం ఊరట కలిగించే విషయం అని మలైకా ఆరోరా అన్నారు.

  Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'
  58 యాప్‌లపై నిషేధం

  58 యాప్‌లపై నిషేధం

  టిక్ టాక్ విషయానికి వస్తే.. భారత్‌లో 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దాదాపు చైనాకు సంంబంధించిన 58 యాప్‌లను నిషేధించడం సంచలనం రేపింది. చైనా, భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు చోటుచేసుకొన్న సందర్భంలో ఇలాంటి నిర్ణయాన్ని కేంద్ర తీసుకోవడంపై కొన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

  English summary
  Actress Nusrat Jahan serious over Modi Government. Nusrat Jahan said that TikTok is an entertainment app. It's an impulsive decision. What's the strategic plan? What about ppl who will be unemployed? Ppl will suffer like demonetisation. I don't have any problem with the ban as it is for national security but who'll answer these question.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X