»   » అతడి కోసం శ్రద్ధాకపూర్, పరిణితి సిగపట్లు.. షాకింగ్‌కు గురిచేసే విషయాలు ఇవే..

అతడి కోసం శ్రద్ధాకపూర్, పరిణితి సిగపట్లు.. షాకింగ్‌కు గురిచేసే విషయాలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ అందాల తారలు శ్రద్ధాకపూర్, పరిణితి చోప్రాలు నటనతోనే కాకుండా సింగర్లుగా తమ పాటలతో కూడా ఆకట్టుకొంటున్నారు. ఇటీవల శ్రద్ధాకపూర్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో, పరిణితి చోప్రా మేరి ప్యారీ బిందు అనే సినిమాలో వారిద్దరూ తమ గళాన్ని వినిపించారు. గాయనిగా స్థిరపడుతున్న వారికి సింగర్లుగా నిరూపించుకోవడానికి పాప్ సంచలనం జస్టిన్ బీబర్ రూపంలో మరో అవకాశం వచ్చింది. బీబర్ షోలో పాట పాడే అవకాశం కోసం వీరిద్దరూ కుస్తీ పట్లు పడుతున్నాటు సమాచారం. తమకు ఉన్న పబ్లిక్ రిలేషన్స్ ఉపయోగించి బీబర్‌తో ఆడిపాడే అవకాశాన్ని చేజిక్కించుకొనేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.

  ఇండియాలో బీబర్ ఫీవర్..

  ఇండియాలో బీబర్ ఫీవర్..

  ఇదిలా ఉంటే భారత్‌లోని యువతను ఇప్పటికే బీబీర్ ఫీవర్ పట్టుకొన్నది. బీబర్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు టికెట్ ఒక్కంటికి రూ.5000 చెల్లించేందుకు యువత సిద్ధపడుతున్నారు. ఈ టికెట్లను ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ అమ్మకాల సంస్థ విక్రయిస్తున్నది. బెంగళూరు, పుణే, కోల్‌కతా, గుర్గావ్, ఢిల్లీకి చెందిన యువతీ, యువకులు ముంబైలోని బీబర్ ప్రదర్శనకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

  బీబర్ ట్వీట్..

  ముంబై చేరుకోవడానికి ఇంకా కొద్దిరోజులే ఉంది. త్వరగా సిద్ధంకండి అంటూ బీబర్ ఇటీవల ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా బీబర్ ఈవెంట్‌పై కామెంట్లు చాలా పెద్ద మొత్తంలో వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో మరికొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

  మే 10వ తేదీన..

  మే 10వ తేదీన..

  ముంబైలో మే 10వ తారీఖున నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ షో ఏర్పాటు చేశారు. ఈ షోలో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖులతోపాటు శ్రద్ధా, సోనాక్షి సిన్హా, అర్మాన్ మాలిక్, పరిణితి చోప్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే శ్రద్ధా, పరిణితి చోప్రాల మధ్యే పోటీ తీవ్రంగా ఉందనేది తాజా సమాచారం.

  కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

  కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

  బీబర్ షోకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు మహాలక్ష్మి నుంచి నవీ ముంబై వరకు హెలికాప్టర్ సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ 30 నిమిషాలకోసారి ఈ రెండు ప్రాంతాల మధ్య చక్కర్లు కొట్టే విధంగా సర్వీస్‌ను ఏర్పాట్లు చేశారు. తిరిగి వెళ్లడానికి స్టేడియం వద్ద ఉబర్ బుకింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

  వైద్య శిబిరాలు..

  వైద్య శిబిరాలు..

  ఏదైనా అనుకొని సంఘటన, తొక్కిసలాట జరిగితే వైద్య చికిత్స అందించడానికి 40 మంది శిక్షణ పొందిన మెడికల్ సూపర్‌వైజర్లను, మూడు గుండెపోటు చికిత్సకు సంబంధించిన అంబులెన్సులు, 3 సాధారణ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచనున్నారు. దాదాపు 25 వేల వాహనాలు రావడానికి అవకాశమున్నందున పార్కింగ్ సరిపడా స్థలాన్ని కేటాయించారు.

  English summary
  The Justin Bieber concert at the DY Patil Stadium in Navi Mumbai on May 32,has become the talk of the town. Now rumours mills are abuzz that another clash is happening between Shraddha Kapoor and Parineeti Chopra. Reportedly, the actresses are clashing over who should perform exclusively at the Justin Bieber concert.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more