దటీజ్ మహాలక్ష్మి సెట్స్ లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు!
క్వీన్ రీమేక్ సెట్స్ లో హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో శరవేగంగా జరుగుతోంది.

క్వీన్ సినిమా తమిళ వర్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. షూటింగ్ సెట్స్ లో పర్లు యాదవ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. కాజల్ అగర్వాల్ ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడ, తమిళ్ వర్షన్ క్వీన్ రిమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ పరుల్ యాదవ్ మాట్లాడుతూ... ''ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి'' అన్నారు. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా మెయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి "దటీజ్ మహాలక్ష్మి" పేరును ఖరారు చేసినట్లు తమన్నా తెలిపింది. 100% లవ్ చిత్రంలో తమన్నా పాత్ర పేరు "దటీజ్ మహాలక్ష్మి" తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి అదే టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పడం జరిగింది.

నటీనటులు: తమన్నా, సిద్దు జొన్నలగడ్డ, జి.వి.ఎల్.నరసింహ రావ్, మాస్టర్ సంపత్. సాంకేతిక నిపుణులు: సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా మెన్: మిట్చెల్, కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, నిర్మాత: మను కుమారన్, బ్యానర్: మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్.


Click it and Unblock the Notifications











