twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్‌ను ఏకేసిన హీరోయిన్: బూతులు తిట్టిన ఫ్యాన్స్, ఆంటీ అంటూ నిర్మాత...

    By Bojja Kumar
    |

    ఏ ఇండస్ట్రీలో అయినా సూపర్ స్టార్లకు ఎదురు మాట్లాడటానికి, వారి సినిమాల్లో ఏదైనా తప్పుడు విషయాలు ఉంటే విమర్శించడానికి క్రింది స్థాయి నటులు, నటీమణులు భయపడతారు. అయితే మలయాళ హీరోయిన్ పార్వతి మీనన్ మాత్రం... ఏ మాత్రం భయపడకుండా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన 'కసాబా' చిత్రంపై విమర్శలు చేసింది. ఈ చిత్రంలో స్త్రీని ఉద్దేశించి, వారిని కించ పరుస్తూ అవమానకరమైన డైలాగులు ఉండటాన్ని ఆమె తప్పుబట్టింది. ఈ ఇష్యూతో ఆమె మీడియాలో హాట్ టాపిక్ అయింది.

     మమ్ముట్టిని ఏకిపారేసింది

    మమ్ముట్టిని ఏకిపారేసింది

    ఇటీవల ‘కసాబా' సినిమా చూసిన అనంతరం పార్వతి తనదైన రీతిలో విమర్శలు చేశారు. నా దురదృష్టం కొద్దీ ఈ సినిమా చూశాను అంటూ... ఆమె మమ్ముట్టిని ఏకి పారేసింది. ఒక సూపర్ స్టార్ నోట స్త్రీలను అవమాన పరిచే విధంగా డైలాగులు ఉండటం ఏమిటి, ఇది సిగ్గుచేటు అంటూ విమర్శించింది.

     బూతులు తిట్టిన అభిమానులు

    బూతులు తిట్టిన అభిమానులు

    సూపర్ స్టార్ మీద విమర్శలు చేస్తే అభిమానులు ఊరుకుంటారా? పార్వతి మీనన్ మీద సోషల్ మీడియా ద్వారా తమ ప్రతాపం చూశారు. ఆమెను బూతులు తిడుతూ, అసభ్యమైన కామెంట్లతో వేధించడం మొదలు పెట్టారు.

     నిర్మాత కూడా రెచ్చిపోయాడు, ఆంటీ అంటూ....

    నిర్మాత కూడా రెచ్చిపోయాడు, ఆంటీ అంటూ....

    ఈ వివాదంలో ‘కసాబా' నిర్మాత కూడా నీచంగా ప్రవర్తించాడనే విమర్శలు వస్తున్నాయి. తమ సినిమాపై విమర్శలు చేసిన పార్వతి మీనన్‌ను ‘ఆంటీ' అంటూ సంబోధిస్తూ తిట్ల వర్షం కురిపించాడు. ‘పార్వతి ఆంటీ, గీతూ ఆంటీ వారి పుట్టినరోజు ఎప్పుడో చెబితే బర్త్ డే గిఫ్టుగా తమ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేస్తాము' అంటూ నిర్మాత టోబీ జార్జ్ ఫేస్ బుక్‌లో కామెంట్ చేశారు.

    చంపుతామంటూ బెదిరింపులు

    చంపుతామంటూ బెదిరింపులు

    ఈ వివాదం మరింత ముదిరింది. కొందరు మమ్ముట్టి అభిమానులు పార్వతి మీనన్‌ను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పార్వతి మీనన్ ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది.

    కేసు నమోదు చేసిన పోలీసులు

    కేసు నమోదు చేసిన పోలీసులు

    తనపై బెదిరింపులకు పాల్పడిన వారి వివారాలతో సహా ఫేస్ బుక్, ట్విట్టర్ లింకులు పోలీసులకు సమర్పించింది. పార్వతి కంప్లయింట్ స్వీకరించిన పోలీసులు ఐటి యాక్ట్ సెక్షన్ 67 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    అనవసర రాద్దాంతం

    అనవసర రాద్దాంతం

    పార్వతి మీనన్ వివాదం మీద మలయాళ నటుడు, ఫిల్మ్ మేకర్ సంతోష్ పండిత్ స్పందిస్తూ.....ఎలాంటి అసభ్యత లేకుండా డిసెంట్ సినిమాలు చేస్తున్న నటీమణులకు నేను చెప్పేది ఒకటే. మీరు సినిమా నిర్మాణంలో టెక్నికల్ అంశాల గురించి తెలుసుకోవాలి. సినిమాలో ఉండే కొన్ని సీన్లు కేవలం వ్యాపార ధృక్పథంతో అని తెలుసుకోవాలి. దీనిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.

    English summary
    After being trolled for her comments on ‘Kasaba’, actress Parvathy files a police complaint. Things went from being nasty to ugly when Mammootty fans intensified their attack on her and began making death threats.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X