twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్

    |

    నటి పవిత్రా లోకేష్ తల్లి, అత్త పాత్రల్లో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా RED సినిమాలో రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా కనిపించింది. సిగరెట్ తాగుతూ బూతులు మాట్లాడుతూ కాస్త గడుసు మహిళగా కనిపించే పాత్రలో నటించింది. ఈ మేరకు పవిత్రా లోకేష్‌కు మంచి గుర్తింపే వచ్చింది. అయితే పవిత్రా లోకేష్‌ తాజాగా ఓ కార్యక్రమంలో హాజరై నరేష్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

    కుంఫూ అసోసియేషన్..

    కుంఫూ అసోసియేషన్..

    కుంఫూ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నరేష్‌ను నియమించిన సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు 'మా' సభ్యులు. అందులో మాలోని ప్రతీ ఒక్క మెంబర్ హాజరయ్యారు. మాలో ఎన్ని బేధాలున్నాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బహిరంగంగానే బాహాబాహీగా గొడవలు పడ్డారు.

    పవిత్రా లోకేష్ అలా..

    పవిత్రా లోకేష్ అలా..

    మా అధ్యక్షుడు నరేష్‌ను కుంఫూ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించడంపై పవిత్రా లోకేష్ మాట్లాడింది. మా అధ్యక్షుడిగా నరేష్ ఎంతో గొప్పగా పని చేశారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలోనూ అందరికీ పర్సనల్‌గా ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కున్నాడు. అలా ఇంకెవ్వరూ చేయలేదని పవిత్రా లోకేష్ చెప్పుకొచ్చింది.

    సొంత డబ్బుతో..

    సొంత డబ్బుతో..

    కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో ఎంతో మందికి సాయం చేశారు. మా నిధి నుంచి కాకుండా తన సొంత డబ్బుతో సాయం చేశారు.. అది నాకు తెలుసు.. అలాంటి వారికి ఇలాంటి బాధ్యత అప్పగిస్తే కూడా ఎంతో బాగా నిర్వర్తిస్తారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కుంఫూ గురించి కొంత రాసుకొచ్చానని పవిత్రా లోకేష్ తెలిపింది.

    అందరికీ అవసరమే..

    అందరికీ అవసరమే..

    కుంఫూ గురించి మాట్లాడుతూ.. ఇది అందరూ నేర్చుకోవాలని తానేమీ ఫేమినిస్ట్‌ను కాదు.. అందరూ ఇది నేర్చుకోవడం మంచిదని శాంతంగా ఎలా ఉండాలో తెలుస్తుంది.. ఎలా ఆలోచించాలి.. స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలో అన్నీ తెలుస్తుంటాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవిత్రా లోకేష్ చేసిన ఈ కామెంట్లు బాగానే వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    Young Comedy Actor Admitted To ICU

    English summary
    Actress Pavithra Lokesh About VK Naresh..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X