వారిద్దరూ వెంటపడి వేధిస్తున్నారు.. రమ్య కొట్టబోయిన తరువాత పోలీసులకు పవిత్ర ఫిర్యాదు!
ప్రస్తుతానికి నటి పవిత్ర లోకేష్ అలాగే నటుడు వీకే నరేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమాన పడుతున్న నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వారిద్దరూ కలిసి ఉన్న హోటల్ వద్దకు వెళ్లి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర లోకేష్ తాజాగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

పద్ధతైన పాత్రలు
కన్నడ నాట నటిగా నిరూపించుకుని తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకున్న పవిత్ర లోకేష్ తెలుగు సినిమాల్లో కూడా నటిగా మంచి పేరు సంపాదించింది. తెరమీద మాత్రం చాలా పద్ధతైన పాత్రలు మాత్రమే చేస్తూ ఉండే ఆవిడ తన కుటుంబంలో సమస్యలకు కారణమైందని తాను తన భర్త విడిపోవడానికి గల కారణం పవిత్ర లోకేష్ అంటూ నటుడు నరేష్ మూడవ భార్య రమ్య కన్నడ మీడియాలో కలకలం రేపింది.

మీడియా ముందుకు వెళ్లి
నిజానికి అప్పటికే నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏదో జరుగుతోందనే విషయం గురించి తెలుగు మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం లేదని నరేష్ పిఆర్ టీమ్ ద్వారా కొంత క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే రమ్య రఘుపతి ఎంట్రీ తరువాత నరేష్ కూడా కన్నడ మీడియా ముందుకు వెళ్లి తన వాదన వినిపించే ప్రయత్నం చేశాడు.

వీడియో విడుదల
తర్వాత ఈ వివాదం పెద్దదయ్యే అవకాశం ఉందని భావించి తన భార్య తన మీద డబ్బు కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. తనకు పవిత్ర ఒక స్నేహితురాలు మాత్రమే అంటూ ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. పవిత్ర తో కూడా ఒక వీడియో విడుదల చేయించి తనకు ఈ వ్యవహారంతో అసలు సంబంధం లేదు అని కావాలనే రమ్య తనమీద ఆరోపణలు చేస్తుందని క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

సహజీవనం చేస్తున్నామని
అయితే కన్నడ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ తాను నరేష్ సహజీవనం చేస్తున్నామని దీనికి కృష్ణ కుటుంబం కూడా మద్దతు తెలిపింది. కృష్ణ గారు నరేష్ తాను కలిసి కృష్ణ గారి ఫామ్ హౌస్ లోనే నివాసం ఉంటున్నామని పవిత్ర వెల్లడించారు. ఇది వివాదంగా మారడంతో పవిత్రా లోకేష్ మైసూరులోని వివిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి తన స్టింగ్ ఆపరేషన్ జరిపిన ఇద్దరు జర్నలిస్టుల మీద ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తప్పుడు సమాచారం
వారు తమ వెంటపడుతూ వేధిస్తున్నారని తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారంటూ పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. నిజానికి ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా తన ఫేక్ అకౌంట్స్ గురించి ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి తన గురించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని వారి మీద సరైన చర్యలు తీసుకోవాలని కూడా పవిత్ర లోకేష్ కోరారు. ఇప్పుడు ఏకంగా జర్నలిస్టుల మీద ఆమె ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











