For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Heroine Poorna Marriage: సీక్రెట్‌గా హీరోయిన్ పూర్ణ పెళ్లి.. వీళ్ల వివాహం ఎలా జరిగిందో చూశారంటే!

  |

  సినీ రంగానికి చెందిన సెలెబ్రిటీలు ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ల ప్రేమ, ఎంగేజ్‌మెంట్, పెళ్లి లాంటి అంశాలు ఏ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇవి దేశ వ్యాప్తంగా హెడ్‌లైన్స్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ సామ్నా కాశీం పెళ్లి పీటలు ఎక్కేసింది. ఎంతో నిరాడంబరంగా జరిగిన వేడుకలో దుబాయ్ షేక్‌ను వివాహం చేసుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? పూర్ణ పెళ్లి ఎలా జరిగింది? ఆ తర్వాత ఆమె ఏం చెప్పింది? అనేవి చూద్దాం పదండి!

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  'శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో హీరోయిన్‌ పూర్ణ తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే 'సీమటపాకాయ్', 'సిల్లీ ఫెలోస్', 'అదుగో', 'రాజుగారి గది', 'మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాలతో పాపులర్ అయింది.

  సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు

  దుబాయ్ షేక్‌తో ఎంగేజ్‌మెంట్

  దుబాయ్ షేక్‌తో ఎంగేజ్‌మెంట్

  కొంత కాలంగా పూర్ణ తెలుగులో మరెవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు, టీవీ షోలతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోంది. అలాగే, బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పూర్ణ అలియాస్ సామ్నా కాసీం దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీ ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.

  పెళ్లి ఆగిందని.. క్లారిటీ ఇచ్చేసి

  పెళ్లి ఆగిందని.. క్లారిటీ ఇచ్చేసి

  దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో నిశ్చితార్థం చేసుకున్న పూర్ణ.. అతడితో వైవాహిక జీవితాన్ని పంచుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్ణ స్పందిస్తూ త్వరలోనే తమ పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది.

  కోహ్లీ భార్య అనుష్క హాట్ షో: పండుగ పూట ఎద అందాలు కనిపించేలా!

  సీక్రెట్‌గానే హీరోయిన్ వివాహం

  సీక్రెట్‌గానే హీరోయిన్ వివాహం

  టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం తాజాగా వివాహం చేసుకుంది. దుబాయ్‌లో గత రాత్రి జరిగిన ఈ వేడుకలో జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ఆమె పెళ్లాడింది. చాలా నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహం ముస్లిం పద్దతిలో జరిగింది.

  ఫొటోలు షేర్ చేసి.. ఎమోషనల్

  ఫొటోలు షేర్ చేసి.. ఎమోషనల్

  దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం చేసుకున్న తర్వాత ఆ ఫొటోలను హీరోయిన్ పూర్ణ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇందులో ఆమె పట్టుచీర కట్టుకుని రాణిలా దర్శనమిచ్చింది. అలాగే, షానిద్ కూడా షెర్వాణీలో మెరిసిపోతున్నాడు. ఇక, తన పెళ్లి వార్తను ఫ్యాన్స్‌తో పంచుకున్న టాలీవుడ్ పూర్ణ.. తన భర్త గురించి ఎమోషనల్‌ కామెంట్స్ చేసింది.

  ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత ఘోరంగా ఎప్పుడూ చూసుండరు!

  మారమని ఎప్పుడూ చెప్పలేదు

  మారమని ఎప్పుడూ చెప్పలేదు

  పూర్ణ రాసిన నోట్‌లో 'ప్రపంచంలోనే నేను ఎక్కువ అందమైన మహిళను కాకపోవచ్చు. అలానే ఉత్తమ జీవిత భాగస్వామికి ఉండాల్సి లక్షణాలు నాలో లేకపోవచ్చు. కానీ మీరు నన్ను.. మీకంటే నేను తక్కువ అనుకునేలా ఏనాడు చూడలేదు.. బాధించలేదు. నేను ఎలా ఉన్నానో అలానే నన్ను ఆరాధించారు. నన్ను మార్చాలని ప్రయత్నించలేదు.. మారమని చెప్పలేదు' అని చెప్పింది.

  మీకు వాగ్దానం చేస్తున్నానంటూ

  మీకు వాగ్దానం చేస్తున్నానంటూ

  ఇదే నోట్‌లో పూర్ణ 'నాలోని అత్యుత్తమ ప్రతిభను మరింతగా వెలికి తీసుకునేందుకు మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈరోజు మనకెంతో ప్రియమైన, సన్నిహితమైన వారి మధ్య మీరూ, నేను కలిసి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, సందర్భాలు ఎదురయినా నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను' అంటూ పేర్కొంది.

  English summary
  Tollywood Actress Poorna AKA Shamna Kasim Gets Engaged. Recently She Shares Personal Photo and Gave Clarity on MArriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X