పెద్ద హీరోయిన్లు నోరు విప్పరు.. అందంగా ఉండే అడుగుతారు.. క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రగతి సంచలన కామెంట్స్

టాలీవుడ్ ఆర్టిస్ట్‌లో ప్రగతి అందరి కంటే ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. తెరపై మోడ్రన్ మదర్ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరు. దాదాపు స్టార్ హీరోలందరికీ అమ్మగానో అత్తగానో నటించింది ప్రగతి. అయితే వెండితెరపై మనం చూసే ప్రగతి వేరు, నిజ జీవితంలో ప్రగతి వేరు. గత కొన్ని రోజులుగా ప్రగతి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. హాట్ హాట్ డ్యాన్సులు, ఫోటోలు, వర్కౌట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రగతి మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

స్టెప్పులు, వర్కౌట్లు..

స్టెప్పులు, వర్కౌట్లు..

తెరపై కనిపించిన ప్రగతికి, సోషల్ మీడియాలో కనిపించే ప్రగతికి ఎంతో తేడా ఉంది. తల్లి, అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రగతిని మరీ ఇంత మోడ్రన్, యంగ్‌గా చూడటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. హీరోయిన్ల మంచి ఫిట్ నెస్‌తో అదరగొట్టే ప్రగతి డ్యాన్సులకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది.

క్యాస్టింగ్ కౌచ్‌పై..

క్యాస్టింగ్ కౌచ్‌పై..


తాజాగా ప్రగతి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో అనేక విషయాలపై స్పందించింది. తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ ఇలా ప్రతీ ఒక్క అంశంపై రియాక్ట్ అయింది. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ, క్యాస్టింగ్ కౌచ్ వంటి వ్యవహారంపైనా సంచలన కామెంట్స్ చేసింది.

పెద్ద హీరోయిన్లు చెప్పరు..

పెద్ద హీరోయిన్లు చెప్పరు..

క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రగతి స్పందిస్తూ.. పెద్ద హీరోయిన్లు, ఓ స్థాయికి వెళ్లిన హీరోయిన్లు ఎవ్వరూ కూడా క్యాస్టింగ్ కౌచ్ లేదని చెబుతారు, తమకు అలాంటివి ఎదరుకాలేదని చెబుతారని తెలిపింది. ఎవరైతే సక్సెస్ కాలేదో వారి వద్ద నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తాయని పేర్కొంది. అయితే క్యాస్టింగ్ కౌచ్ ఆ రెండూ కేసుల్లో ఉండొచ్చు. ఉండకపోవచ్చని చెప్పుకొచ్చింది.

అందంగా ఉంటే అడుగుతారు..

అందంగా ఉంటే అడుగుతారు..


అమ్మాయి కోసమే సినిమా తీసే పరిస్థితులు మారిపోయాయని, మనం కాకపోతే ఎంతో మంది నటించేందుకు రెడీగా ఉన్నారని తెలిపింది. అమ్మాయిని నమ్ముకునే కోట్లు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రారని పేర్కొంది. ఎక్కడైనా సరే అమ్మాయి అందంగా ఉంటే అలాంటి వాటి కోసం అప్రోచ్ అవుతారని, అవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పుకొచ్చింది.

Recommended Video

Adah Sharma Is Excited About Her New Film | రెండు చిత్రాలకు సైన్ చేసిన బ్యూటీ
మన మీదే ఆధారపడి..

మన మీదే ఆధారపడి..


అయితే అలాంటి సందర్భాలు ఎదురైతే ఎలా రియాక్ట్ అవ్వాలనేది మన మీదే ఆధారపడి ఉంటుందని తెలిపింది. తనకూ ఇలాంటి సంఘటనలు ఎదురైతే అక్కడి నుంచి వెళ్లిపోవడమో, లేదా సినిమా నుంచి తప్పుకోవడం వంటివో చేస్తానని, చేశాను కూడా అని చెప్పుకొచ్చింది. అంతే కాని ఎవరో మీదో ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదని, అయినా ఏ ఒక్కరో అలా చేశారని ఇండస్ట్రీ మొత్తాన్ని అనడం కరెక్ట్ కాదని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X