నా పతనానికి కారణం అదే... అతడిని పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు.. ప్రగతి కామెంట్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వయసులోనూ విపరీతమైన వర్కౌట్లు, లుంగీ కట్టి మాస్ స్టెప్పులు వేయడం, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రగతి బాగా పాపులర్ అయింది. ఈ లాక్ డౌన్ కాలంలో ప్రగతి చేసినంత రచ్చ మరే నటి చేయలేదు. నిత్యం ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ త ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేసింది. తాజాగా ఓ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి అనేక విషయాలపై స్పందించింది. అందులో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను ఆమె మాటల్లోనే చూద్దాం.

పదహారేళ్ల వయసులోనే..

పదహారేళ్ల వయసులోనే..

‘పదహారు, పదిహేడు వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. పెద్దగా చదువుకోలేదు. మొదటగా ఓ యాడ్ షూట్ కోసం వచ్చాను. ఆపై హీరోయిన్‌గా మారిపోయాను. ఆ కెరీర్ కూడా త్వరగానే ముగిసిపోయింది. ఇరవై యేళ్లకే పెళ్లి కూడా చేసుకున్నాను.

ఆ వాతావరణం నచ్చకే..

ఆ వాతావరణం నచ్చకే..

మొదటగా హీరోయిన్ అవుదామని నేను ఫిక్స్ కాలేదు. ఇండస్ట్రీలో ఉందామని కూడా రాలేదు. అందుకే ఇక్కడి వాతావరణం నాకు అంతగా నచ్చలేదు. చిన్నతనం నుంచి నాపై ఎవరైనా అధికారం, పెత్తనం చలాయిస్తే నాకు నచ్చేది కాదు. అది కూడా ఒక కారణం కావచ్చు. అందుకే ఇకే ఏడాదిలో ఆరేడు తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించాక నాకు అర్థమైంది.

అందుకే వెంటనే పెళ్లి..

అందుకే వెంటనే పెళ్లి..

ఇక సినిమా ఇండస్ట్రీకి నేను ఫిట్ కాదని అనిపించింది. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాను. తరువాత ఏంటి? అని ఆలోచిస్తే నాకు కనిపించిన ఆప్షన్ పెళ్లి. నాకు చిన్నతనం నుంచి కూడా పెళ్లి చేసుకునే సెటిల్ అవ్వాలనే కోరిక ఉండేది. అందుకే నాకు కనిపించిన ఆప్షన్ అదే. నా అహంకారానికి ఆప్షన్.. నా పతనానికి కనిపించిన ఆప్షన్ అదే.

మళ్లీ సినిమాల్లోకి..

మళ్లీ సినిమాల్లోకి..

పెళ్లయ్యాక వెంటనే బాబు పుట్టాడు. బరువు, బాధ్యతలు పెరగాయి.. బతకడానికి ఏదో ఒక పని చేయాలి.. నేను చదివిన చదువుకు కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా రాదు. నాకు తెలిసింది నటించడమే. అందుకే మళ్లీ సినిమాల్లోకే వచ్చాను.

Recommended Video

Adah Sharma Is Excited About Her New Film | రెండు చిత్రాలకు సైన్ చేసిన బ్యూటీ
పెళ్లి చేసుకోకూడదు..

పెళ్లి చేసుకోకూడదు..

అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోడం నేను చేసిన తప్పు. నేననే కాదు ఎవ్వరైనా సరే ఓ వయసు వచ్చే వరకు, వారి కాళ్ల మీద వారు నిలబడి సంపాదించుకునే వరకు పెళ్లి చేసుకోకూడదు. నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే' అంటూ ప్రగతి తన జీవిత గాథను వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X