అక్కా కుస్తీ పోటీలకా? నెటిజన్ తుంటరి ప్రశ్నకు ప్రగతి షాకింగ్ రిప్లై

దక్షిణాది సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అమ్మగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ప్రగతి ఈ మధ్య తన ఫిట్‌నెస్, డ్యాన్స్ స్టెప్పులపై దృష్టిపెట్టారు. సోషల్ మీడియాలో వీడియోలతో హంగామా చేస్తున్న ప్రగతి.. తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు గట్టిగా బుద్ది చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రగతి

టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రగతి

నటిగా ప్రగతి విషయానికి వస్తే.. అద్భుతమైన టాలెంట్ ఉన్న క్యారెక్టర్ యాక్టర్. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పిస్తారు. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకొన్నారు. హెల్త్, వర్కవుట్లతో దడదడలాడించారు. డ్యాన్సులు చేస్తూ షేర్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.

బాక్సింగ్ రింగ్ వద్ద కసరత్తులతో

బాక్సింగ్ రింగ్ వద్ద కసరత్తులతో

సోషల్ మీడియాలో హంగామా చేసే ప్రగతి తాజాగా ఓ బాక్సింగ్ రింగ్ వద్ద కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే నెటిజన్లు ఆమె వీడియోపై రకరకాల స్పందిస్తున్నారు.

తుంటరి నెటిజన్ ట్రోల్స్

తుంటరి నెటిజన్ ట్రోల్స్

యాక్టర్ ప్రగతి షేర్ చేసిన వీడియో కింద తన భావాలను పంచుకొన్నారు. నా తప్పులకు, నా ఛాయిసెస్‌కు, నా క్రమశిక్షణ, నా పట్టుదలకు, నా పిచ్చితనానికి ఇది ఓ ఫలితం అంటూ ఓ మేసేజ్‌ను షేర్ చేశారు. అయితే ఓ తుంటరి నెటిజన్‌ తనదైన శైలిలో తన బుద్దిని బయటపెట్టారు.

గట్టిగా గడ్డిపెట్టిన ప్రగతి

గట్టిగా గడ్డిపెట్టిన ప్రగతి

నటి ప్రగతి షేర్ చేసిన కసరత్తుల వీడియోను ఉద్దేశించి ఓ నెటిజన్ స్పందిస్తూ.. అక్కా.. ఎందుకే ఇంత కష్టం. కుస్తీ పోటీలకు ఏమైనా పేరు ఇచ్చావా అంటూ కామెంట్ చేశారు. దాంతో ప్రగతికి చిర్రెత్తుకొచ్చి.. నీకు ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఎదుటివారిని నిరుత్సాహపరచడం ప్యాషన్ అయితే.. నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ ప్యాషన్. నేను ఇతరులు ఇష్టపడే విషయాల కోసం కాకుండా నాకు నేనుగా ప్రేమించే విషయాల కోసం జీవిస్తాను అని ప్రగతి గట్టిగా గడ్డిపెట్టారు.

విడుదలకు సిద్ధమైన ప్రగతి సినిమాలు

విడుదలకు సిద్ధమైన ప్రగతి సినిమాలు

యాక్టర్ ప్రగతి కెరీర్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు కే భాగ్యరాజ్ రూపొందించిన వీట్ల విశేషంగా చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రాణించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X