ఆ తిప్పడం, ఆ మూమెంట్స్ కేక.. స్టార్ హీరోయిన్స్ కూడా దిగదుడుపే.. ప్రగతి వీడియో వైరల్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్‌లో ప్రగతి ప్రస్తుతం ముందంజలో దూసుకుపోతోంది. దీనికి కారణం సోషల్ మీడియాలో ప్రగతికి ఉన్న ఫాలోయింగే. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రగతి చేసిన రచ్చ ఇంకెవ్వరూ చేసి ఉండరు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ సెగలు పుట్టించిన ప్రగతి.. ఇంట్లో డ్యాన్స్‌లు చేస్తూ దుమ్ములేపింది. ప్రగతి లుంగీ కట్టుకుని వేసిన స్టెప్పులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ప్రగతి చేసిన డ్యాన్సులు, వేసిన స్టెప్పులు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

ఆ ప్రగతి వేరు..
తాజాగా ప్రగతి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ ఇలా ఎన్నో విషయాలపై స్పందించింది. తెరపై చూసే ప్రగతి కాకుండా తనకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుందని, అదే నిజమైన ప్రగతి అని చెప్పుకొచ్చింది. సోసల్ మీడియాలో హల్చల్ చేసేదే నిజమైన ప్రగతి అని తెలిపింది.

డ్యాన్స్ అంటే ఇష్టం..
చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టమని, అయినా సంతోషం వస్తే ఎవ్వరైనా చేసే పని అదేనని ప్రగతి తెలిపింది. డ్యాన్స్ చేయడం చాలా ఇష్టమని అందుకే ఆ వీడియాలు పెడుతున్నానని చెప్పుకొచ్ిచంది. ఇక స్వతాహాగా ఫిట్‌గా ఉండటం ఇష్టమని అందుకే వర్కౌట్లు కూడా భారీగానే చేస్తున్నానని పేర్కొంది.

అన్ని రకాలు మూమెంట్స్..
ప్రగతి అన్ని రకాలు మూమెంట్స్‌ను అదరగొడుతుందని తెలుస్తోంది. మొదటగా తనలోని క్లాస్‌ను చూపెట్టింది. ఆపై లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు వేసి దుమ్ములేపింది. ఇక ఇప్పుడు మళ్లీ క్లాసికల్ డ్యాన్స్‌తో రచ్చ చేసింది. బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని కజ్‌రారే పాటకు ఐశ్వర్యా రాయ్‌లా స్టెప్పులు వేసింది.
Recommended Video

ఆ తిప్పడం చూస్తే షాక్..
కజ్‌రారే పాటలో లీనమైన ప్రగతి.. వేసిన స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూమెంట్స్, ఆ తిప్పడం చూస్తే ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని అనుకుంటారు. ఇక ప్రగతి రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రగతి బిగ్ బాస్ షోకు సంబంధించి వస్తోన్న రూమర్లను ఖండించిన సంగతి తెలిసిందే. అలాంటి షోకు వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











