Pragathi: నిర్మాతతో ప్రగతి రెండో పెళ్లి వార్తలు.. వీడియో రిలీజ్ చేసి షాక్?

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె తెగ ట్రెండింగ్ లోకి వచ్చింది. దానికి కారణం.. ఓ నిర్మాతను తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఆమె ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించింది. తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసి.. అసలు విషయం చెప్పింది. తన పర్సనల్ విషయాలు.. ఇలా ఎలాంటి అధారాలు లేకుండా ఎలా రాస్తారని మండిపడింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సీనియర్ నటి ప్రగతి.. ఎన్నో సినిమాల్లో భార్యగా, అక్కగా, అమ్మగా నటించి మెప్పించింది. సినిమాల్లో ఎంత పద్ధతిగా ఉంటుందో.. బయట అంత బోల్డ్ గా ఉంటుంది. ఆమె తన సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ.. ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది. ఎక్స్ పోజింగ్ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు అందాలు ఆరబోస్తుంది. ఎప్పటికప్పడు తనపై వచ్చిన రూమర్స్ పైన కూడా క్లారిటీ ఇస్తుంది. ఇక ఇటీవల ఆమెపై వార్తలు ట్రెండింగ్ గా మారాయి.

Actress Pragathi Fires on Media Oraganisations About Her Second Marriage Rumours Video Goes Viral

ఇటీవల ప్రగతి.. రెండో పెళ్లంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అది కూడా స్టార్ ప్రొడ్యూసర్ ను ప్రగతి పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రోడ్యూసర్ యే ఆమెకు ప్రపోజల్ పెట్టగా.. ఆమె యాక్సెప్ట్ చేసినట్లు చాలా వరకు మీడియా సంస్థలు వార్తలు రాశఆయి. ఇక వీరి పెళ్లి త్వరలో జరగనుందని రాసుకువచ్చారు. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం ప్రగతి వరకు వెళ్లినట్లుంది.

ఇక ప్రగతి ఈ విషయంపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన మీద వచ్చే రూమర్లు, ట్రోలింగ్‌ ను తిప్పి కొడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తనపై రూమర్లు, వాటిని రాసిన మీడియా సంస్థల మీద ప్రగతి ఫైర్ అయింది. తన రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్లను సోషల్ మీడియా వేదికగా ఖండించింది. అవి నిరాధారమైనవని చెప్పుకువచ్చింది. సాక్ష్యాలు ఉంటే రాయండి.. అసలు అలాంటిది ఉంటే తానే ముందుగా చెబుతాను కదా? అంటూ ఓ మీడియా సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

Actress Pragathi Fires on Media Oraganisations About Her Second Marriage Rumours Video Goes Viral

ఆ వీడియోలో ఏముందంటే... అందరికీ నమస్కారం.. ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి రూమర్లు రాయడం నాకు బాధగా అనిపిస్తుంది. నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాయడం... బాధ్యతారాహిత్యమే. మీరు ఓ సంస్థ నడుపుతున్నారు.. అక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్లుంటారు.. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా రాస్తారు.. మీరేమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు.. మీకేం హక్కు ఉంది.. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా రాయడానికి మీకేం హక్కుంది.. మీ దగ్గర ఏ ఆధారం లేకుండా ఎలా రాస్తారు.. మీదాంట్లో ఎవరైనా కలగని రాశారా?.. నేను దీన్ని ఖండిస్తున్నాను అంటూ చెప్పుకువచ్చింది.

ఒకరి గురించి రాసేముందు.. అది నిజమా కాదా అని చూసి రాయండి. బాధ్యతగా తీసుకుని... ఆధారాలుంటే రాయండి.. అసలు అలాంటి విషయం ఉంటే నేనే చెప్తా కదా... మీ సంస్థను చీప్ చేయకండి.. నా సెల్ఫ్ రెస్పాక్టును ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది... దీన్ని నేను ఖండిస్తున్నాను.. బాధ్యతతో మెలగండి.. ప్రొఫెషనల్ ఎథిక్స్, జర్నలిజం ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా?.. ఆధారం లేకుండా.. బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా రాయొద్దనేది ఉంటుంది.. ఇది అన్ ప్రొఫెషనల్, అన్ ఎథికల్, ఇది బాధ్యతరాహిత్యం.. ఇకపై ఇలా చేయకండి అంటూ ప్రగతి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X