Pragathi: స్టార్ కమెడియన్ అసభ్యంగా ప్రవర్తించాడు.. క్యారవాన్‌లోకి తీసుకెళ్లి.. ప్రగతి షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు పొందారు ప్రగతి. సినీ కెరీర్ లో మొదటగా హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ సీనియర్ నటి హీరో హీరోయిన్లకు తల్లిగా అనేక చిత్రాల్లో ఆకట్టుకున్నారు. తల్లి పాత్రలోనే కాకుండా అత్తగా, వదినగా, అక్కగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ వందలాది సినిమాలతో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో సందడి చేస్తున్న ప్రగతితో ఓ స్టార్ కమెడియన్ అసభ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆమె ఏం చెప్పిందనే వివరాల్లోకి వెళితే..
క్యాస్టింక్ కౌచ్:చిరుతలో రామ్ చరణ్ కు తల్లిగా, బృందావనంలో తారక్ కు అమ్మగా హుందాగా నటించి ఆకట్టుకున్నారు ప్రగతి. ప్రస్తుతం సీనియర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ కెరీర్ పరంగా ముందుగు సాగుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ టాపిక్ లో భాగంగా స్టార్ కమెడియన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

నా వల్ల కాలేదు:"ఆయన సెట్ లో ఎప్పుడు చాలా బాగా మాట్లాడతారు. చాలా బాగా బిహేవ్ చేస్తారు. నాతోపాటు అందరితో చాలా నైస్ గా ఉంటారు. ఎందుకో ఒకరోజు సడెన్ గా నాతో అతని బిహేవియర్ సరిగా లేదు. సెట్ లో సడెన్ గా అలా మిస్ బిహేవ్ చేసేసరికి.. ఏంటీ ఆయన ఇలా చేశారు అనిపించింది నాకు. దాన్ని జీర్ణించుకోవడం నావల్ల కాలేదు" అని ఆర్టిస్ట్ ప్రగతి తెలిపారు.

లంచ్ తినలేకపోయా:"ఒక 11, పదకొండున్నర గంటల సమయంలో ఆయన మిస్ బిహేవ్ చేయడం జరిగింది. ఇక నాకు అప్పటి నుంచి ఏం చేయాలనిపించలేదు. లంచ్ తినలేకపోతున్నాను. సాయంత్రం టీ కూడా తాగలేకపోతున్నాను. ఆయనకు ప్యాకప్ అయిపోయింది. నాకు ఇంకా షూటింగ్ లో వర్క్ ఉంది" అని ప్రగతి పేర్కొన్నారు.

ఒప్పుకుంటున్నట్లు:"ఆయనకు వర్క్ అయిపోవడంతో వెళ్లడానికి బయలు దేరుతున్నారు. ఒక్కసారి మీతో మాట్లాడాలి అన్నాను. నేనే క్యారవాన్‌లోకి తీసుకెళ్లాను. నేను మీతో ఎప్పుడైన మిస్ బిహేవ్ చేశానా. అంటే నా సైడ్ నుంచి మీకు రాంగ్ సిగ్నల్ కానీ, నా బాడీ లాంగ్వెజ్ కానీ, నా కళ్లు కానీ నాకే తెలియకుండా నేను ఒప్పుకుంటున్నట్లుగా ఏమైనా ఆహ్వానించానా" అని అన్నాను అని ప్రగతి చెప్పుకొచ్చారు.

చేస్తారని అనుకోలేదు:"నేను అన్నదానికి అయ్యయ్యో ఏంటమ్మా అలా చెబుతున్నావ్. ఏంటమ్మా ఇది అన్నారు. మరి ఏంటండి మీరు అలా అనేసారు. కరెక్ట్ కాదు కదా. మీరు అలా చేస్తారని నేను అనుకోలేదు. నేను అక్కడే వెంటనే రియాక్ట్ అయితే ఏంటండి పరిస్థితి. మీరు అని ఒక్క నిమిషం ఆగాను. మీరు అలా చేయరు అనే నమ్మకంతో.. నా సైడ్ నుంచి నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్ జరిగిందా అని నేను కన్ఫర్మేషన్ కు వచ్చాను అంటే ఓకే ఓకే ఇట్స్ ఫైన్ అని బయటకు వచ్చారు" అని ప్రగతి అన్నారు.

ప్రగతికి పొగరు:ప్రగతి అలా చెప్పాక.. "ఆ సంఘటన తర్వాత ఆయనే మీ గురించే చాలా చెప్పారంట కదా. ప్రగతికి చాలా పొగరు. యాటిట్యూడ్ ఎక్కువ అన్నారట" అని యాంకర్ అడిగారు. "హా విన్నాను. చాలా మందితో" అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు సీనియర్ నటి ప్రగతి. అయితే ఆ స్టార్ కమెడియన్ ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు.


Click it and Unblock the Notifications











