ప్రగతి ఆంటీ జోష్ మాములుగా లేదుగా.. తీన్మార్‌తో ఊరమాస్.. దడడడలాడిస్తున్న వీడియో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటి ప్రగతి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తల్లి, అక్క, వదిన లాంటి పాత్రల్లో జీవిస్తారనే పేరుంది. విషాదంతో కూడిన పాత్రలను పోషించడంలో ఆమెకు ఆమె సాటి అంటుంటారు. అయితే తాజాగా ప్రగతి గురించి అందరూ ఊహించుకొంటే.. తనలో మరో కోణాన్ని బయటపెట్టడం.. తీన్మార్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

టాలెంటెడ్ నటిగా

టాలెంటెడ్ నటిగా

యాక్టర్ ప్రగతిలో టాలెంట్‌కు ఏ మాత్రం కొదవ లేదని తన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటారు. చాలా చిన్న వయసులోనే అమ్మ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆమె కొన్నేళ్లుగా తనదైన శైలిలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తారు. ఛాన్స్ దొరికితే రొటీన్‌కు భిన్నంగా తెరపైన మ్యాజిక్ చేయడానికి ప్రయత్నిస్తారనే అభిప్రాయం కూడా ఉంది.

 క్యారెక్టర్ ఆర్టిస్టుగా

క్యారెక్టర్ ఆర్టిస్టుగా

హీరోయిన్‌గా ప్రయత్నించే సమయంలో తనకు ఓ సీనియర్ నటి ఇచ్చిన సలహాతోనే క్యారెక్టర్‌గా స్థిరపడ్డాను. క్యారెక్టర్ ఆర్టిస్టుకు లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో నిలబడి పోవచ్చు అనే సలహాను బలంగా నమ్మాను. అందుకే హీరోయిన్ వేషాలకు గుడ్‌ బై చెప్పానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రగతి వీడియో వైరల్

ప్రగతి వీడియో వైరల్

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం సినీ పరిశ్రమ స్తంభించడంతో ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ తమకు తోచిన పనిని సినీ తారలు చేస్తూ అభిమానులను ఆకట్టుకొంటున్నారు. కొందరు వంటపనులు, ఇంటి పనుల్లో బిజీగా మారితే.. మరికొందరు జిమ్‌లో చేరి ఫిట్‌‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నటి ప్రగతి మాత్రం డిఫరెంట్‌గా చేసి వైరల్‌గా మారింది.

ఊరమాస్‌ డ్యాన్స్‌తో

తాజాగా సోషల్ మీడియాలో ప్రగతి డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఊరమాస్‌ లెవెల్‌లో తీన్మార్ స్టెప్పులతో దడదడలాడించేసింది. మరో వ్యక్తితో కలిసి ఏ హీరోయిన్‌‌కు సాధ్యపడని విధంగా స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended Video

Screenplay Movie Public Talk | Vikram Shiva | Pragathi Yadhati
ఈ రేంజ్‌లో ప్రగతి డ్యాన్సా?

ఈ రేంజ్‌లో ప్రగతి డ్యాన్సా?

దాంతో నటి ప్రగతిలోని మరో కోణం బయటకు వచ్చింది. ఎప్పుడూ చాలా సౌమ్యంగా తెరపైన డైలాగ్స్ చెబుతూ కంటతడి పెట్టించే ప్రగతిలో ఈ రేంజ్ డ్యాన్సర్ ఉందా అని ప్రతీ ఒక్కరు కామెంట్లు విసురుతున్నారు. అయితే ఈ వీడియో లాక్‌డౌన్‌గా లేక గతంలోనిదా అనేది ప్రగతి స్వయంగా చెబితేగానీ ఆ అనుమానాలకు తెర పడుతుందని అంటున్నారు అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X