twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ వీడియో : ఆ తన్నడం ఏంది? ఆ వర్కౌట్లు ఏంది?.. ప్రగతి రచ్చ మామూలుగా లేదు!!

    |

    టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. అయితే ఇంత వరకు వెండితెరపై మాత్రమే ప్రగతిని చూసిన వారికి.. సోషల్ మీడియాలో ప్రగతిని చూసిన వారికి ఆశ్చర్యం వేయక మానదు. అమ్మగానో, అత్తగానో ఇంత వరకు కనిపించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రగతి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన వర్కౌట్లు, ఇచ్చిన పంచ్‌లు తెగ వైరల్ అవుతున్నాయి.

     సోషల్ మీడియాలో రచ్చ..

    సోషల్ మీడియాలో రచ్చ..

    వెండితెరపై ప్రగతి ఎంతటి పేరు సంపాదించిందో.. ఆ పేరు రావడానికి ఎన్నేళ్లు పట్టిందో గానీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వగానే అది వంద రెట్లు పెరిగింది. సోషల్ మీడియాలో ప్రగతి చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు తీసిపోని విధంగా తయారవుతోంది.

    మాస్ స్టెప్పులు వైరల్..

    మాస్ స్టెప్పులు వైరల్..

    ప్రగతి చేసే వర్కౌట్లు, ఎక్సర్‌సైజ్‌లు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ లాక్ డౌన్‌లో ప్రగతి వేసిన స్టెప్పులు, లుంగీ కట్టి వేసిన మాస్ డ్యాన్సులు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. తాజాగా ప్రగతి ఇచ్చిన ఇంటర్వ్యూ, అందులో మాట్లాడిన అంశాలు సైతం హాట్ టాపిక్ అయ్యాయి.

    ఎన్నో విషయాలపై స్పందన..

    ఎన్నో విషయాలపై స్పందన..

    తెరపై చూసే ప్రగతి వేరని, తనకంటూ సొంత జీవితం ఉంటుందని అదే అసలైన ప్రగతి అని తెలిపింది. సోషల్ మీడియాలో తాను చేసే వీడియోలు ఎందరిలోనే స్ఫూర్తిని నింపుతున్నాయని, అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయని అందుకే కంటిన్యూ చేస్తున్నానని తెలిపింది. నెపోటిజం, వ్యక్తిగత జీవితం, బిగ్ బాస్ ఎంట్రీ ఇలా ప్రతీ ఒక్క విషయంపైనా ప్రగతి స్పందించింది.

    Recommended Video

    Adah Sharma Is Excited About Her New Film | రెండు చిత్రాలకు సైన్ చేసిన బ్యూటీ
    కిక్ బాక్సింగ్ శిక్షణ..

    కిక్ బాక్సింగ్ శిక్షణ..

    ప్రస్తుతం ప్రగతి కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రగతి ఫిట్ నెస్ కష్టాలు చూస్తుంటే త్వరలోనే మంచి ఫలితం దక్కేలా కనిపిస్తోంది. ప్రగతి వర్కౌట్ల కష్టం తెరపై కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఇక ప్రగతి కేవలం అమ్మ, అత్త పాత్రలే కాకుండా పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కూడా వస్తాయేమో చూడాలి.

    English summary
    Actress Pragathi Workout Goes Viral. she wanst To Maintain Fitness. For This She Is Foing WOrkouts ANd Practicing Kick Boxing ALso.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X