Pranitha Subhash సీక్రెట్‌గా వివాహం.. పెళ్లి కొడుకు ఎవరంటే...

దక్షిణాది ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకొన్న కన్నడ భామ ప్రణిత సుభాష్ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకొన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో నితిన్ రాజును వివాహం చేసుకొన్నారు. అయితే ఆమె పెళ్లి వార్త ఆలస్యంగా మీడియాలో వెలుగు చూసింది. ప్రణిత సుభాష్ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Filmibeat Telugu
రెండు రోజుల తర్వాత ప్రణిత పెళ్లి వార్త

రెండు రోజుల తర్వాత ప్రణిత పెళ్లి వార్త

హీరోయిన్ ప్రణిత వివాహం శుక్రవారం జరిగినట్టు సన్నిహితులు వెల్లడించారు. అయితే రెండు రోజుల తర్వాత నితిన్ రాజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేయడంతో ప్రణిత పెళ్లి వార్త మీడియాలో గుప్పుమన్నది. ప్రస్తుతం ప్రణిత పెళ్లి ఫోటో మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.

కోవిడ్ నిబంధనల కారణంగా నిరాడంబరంగా

కోవిడ్ నిబంధనల కారణంగా నిరాడంబరంగా

ప్రణిత, నితిన్ రాజు తమ వివాహాన్ని వైభవంగా జరుపుకోవాలని నిశ్చయించుకొన్నారు. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నారు. కేవలం తమకు సన్నిహితంగా ఉన్న వారిని, కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామ్యులుగా మారారు అంటూ సన్నిహితులు తెలిపారు.

పెళ్లి కొడుకు ఎవరంటే..

పెళ్లి కొడుకు ఎవరంటే..

అయితే ఎలాంటి సమాచారం లేకుండా ప్రణితి పెళ్లి చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. నితిన్ రాజు విషయానికి వస్తే.. బెంగళూరుకు చెందిన వాడిగా మాత్రమే సమాచారం ఉంది. నితిన్ రాజు ఎవరు? వారిది ప్రేమ వివాహమా? లేక పెద్దలు జరిపించిన వివాహమా అనే విషయంపై ఇంకా గోప్యత కొనసాగుతున్నది.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రణిత

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రణిత

గతంలో ఎప్పుడ లేని విధంగా ప్రణిత కెరీర్ రివ్వున దూసుకెళ్తున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. హంగామా2, భుజ్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆమె అనూహ్యం పెళ్లి వార్త చెప్పడంతో అభిమానులు షాక్‌లో ఉన్నారు.

దక్షిణాదిలో ప్రణిత కెరీర్

దక్షిణాదిలో ప్రణిత కెరీర్

దక్షిణాది కెరీర్ విషయానికి వస్తే... కన్నడలో రిషితో కలిసి రామన అవతార చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో సిద్దార్థ్‌తో కలిసి బావ అనే మూవీలో, అలాగే తమిళంలో కార్తీతో కలిసి శకుని చిత్రంలో నటించింది. ఇక పోకిరి కన్నడ రీమేక్ ద్వారా దర్శన్‌తో కలిసి నటించడం ద్వారా ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X